విరాళం కోసం శ్రీదేవి కోటా చీర వేలం

Fri,February 22, 2019 06:08 PM
sridevi's kota saree tobe auctioned for charity

బహుభాషా నటి శ్రీదేవి విషాద మరణం కలిగించిన షాక్ నుంచి దేశం ఇంకా పూర్తిగా కోలుకోనేలేదు. కానీ అప్పుడే ఆమె ప్రథమ వర్థంతి సమీపిస్తున్నది. ఈ సందర్భంగా ఆ మహానటి ధరించిన కోటా చీరను వేలం వేయాలని ఆమె భర్త బోనీకపూర్ నిర్ణయించారు. ఆ వేలం ద్వారా వచ్చిన సొమ్మును ధారమిక కార్యాలకు వినియోగించాలనేది ఆయన ఆశయం. ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించబోతున్నారు. వేలం ఆదాయాన్ని మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, నిస్సహాయులు, వృద్ధుల కోసం, విద్యాభివృద్ధికి పనిచేసే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తారు. అబుధాభీలో సమీపబంధువు మోహిత్ మార్వా వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లిన శ్రీదేవి అక్కడే హోటల్‌లో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించారు. ఆమె చితాభస్మాన్ని కుటుంబసభ్యులు తమిళనాడులోని రామేశ్వరం తీరంలో సముద్రంలో కలిపినట్టు వార్తలు వెలువడ్డాయి.

3621
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles