లాక్మే ఫ్యాష‌న్ వీక్ షో లో మెరిసిన శ్రీదేవి కూతురు ఖుషి

Mon,August 21, 2017 04:10 PM
లాక్మే ఫ్యాష‌న్ వీక్ షో లో మెరిసిన శ్రీదేవి కూతురు ఖుషి

డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా కు చెందిన లాక్మే ఫ్యాష‌న్ వీక్ షోలో మెరిసి సంద‌డి చేసింది అందాల తార శ్రీదేవి కూతురు ఖుషి. త‌న‌తో పాటు శ్రీదేవి కూడా ఈ షో కు హాజ‌ర‌యింది. అదివారం తో ముగిసిన ఈ వేడుక‌కు వీళ్ల‌తో పాటు హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెస్, ఆదిత్యా రాయ్ క‌పూర్, క‌రిష్మా క‌పూర్, దియా మీర్జా, సోనాలి బింద్రే, శ్రియా శ‌ర‌ణ్, అమృత అరోరా పాల్గొన్నారు. శ్రీదేవి తో అప్పుడ‌ప్పుడు వేడుక‌ల‌ను త‌న కూతుళ్లు జాహ్న‌వి, ఖుషి అటెండ్ అవుతుంటారు. ఇక‌.. ఈ షో లో మెరిసిన ఖుషీనే సెంటర్ ఆఫ్ అట్రాక్ష‌న్ అయింది. త‌న అక్క జాహ్న‌వి క‌పూర్ బాలీవుడ్ డెబ్యూ గురించి ఇండ‌స్ట్రీలో ర‌క‌ర‌కాల పుకార్లు వినిపిస్తున్నా.. ఖుషి సినీ ఇండ‌స్ట్రీ ఎంట్రీ పై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు.

1568

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS