ఇందిరా గాంధీ పాత్ర చేయాల‌నుకున్న శ్రీదేవి

Sat,March 10, 2018 01:06 PM
Sridevi spoke about her role in politics

దివంగ‌త న‌టి శ్రీదేవి అందం, అభిన‌యం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దాదాపు 300 సినిమాలు చేసిన శ్రీదేవికి లెక్కకి మంచి అభిమానులు ఉన్నారు. తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం ఇలా ప‌లు భాష‌ల‌లో ప్ర‌త్యేక పాత్ర‌లు చేసిన శ్రీదేవి ఫిబ్ర‌వ‌రి 24న అకాల మ‌ర‌ణం చెందారు. ఆమె మ‌ర‌ణం సినీ ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు. అయితే 1992లో శ్రీదేవి సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఖ‌లీద్ మ‌హ‌మ్మ‌ద్‌కి ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఇందులో త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తో పాటు సినిమాల‌కి సంబంధించిన విష‌యాలు షేర్ చేసుకుంది. ఇంట‌ర్వ్యూలో భాగంగా ఖలీద్ శ్రీదేవిని మీరు వెండితెర‌పై ఏ పొలిటీషియ‌న్ రోల్ చేయాల‌నుకుంటున్నారని అడ‌గ‌గా, భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి ఇందిరా ప్రియదర్శినీ గాంధీ పాత్ర చేయాల‌ని చెప్పుకొచ్చింది.

లేడి సూపర్ స్టార్‌గా 1980, 90ల‌లో హీరోస్‌కి కూడా పోటీ ఇచ్చిన హీరోయిన్ ఎవ‌రంటే శ్రీదేవి అని చెప్ప‌వ‌చ్చు. వైజ‌యంతి మాల‌, హేమ మాలిని వంటి స్టార్ హీరోయిన్స్ ఉన్నా, శ్రీదేవికి ఉన్న ప్ర‌త్యేక‌త వేరు. అప్ప‌ట్లో ఆమె చెప్పిన ప‌లు విశేషాలు అభిమానుల‌కి ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. సినిమాలో భ‌ర్త కాని తండ్రి కాని భ‌ర్త కాని చనిపోతే అది చూసి చాలా ఎమోష‌న‌ల్ అయి ఏడుస్తూనే ఉంటాను. ఒక‌నొక ద‌శ‌లో ఏడ్చి ఏడ్చి నా క‌ళ్లు వాచిపోతాయి అని అంది. ఇక తాను తొలిసారి కెమెరా ఫేస్ చేసే స‌మ‌యంలో చాలా భ‌య‌ప‌డి ఆమె త‌ల్లి చీరు కొంగు ప‌ట్టుకుందట‌. త‌ల్లి కాస్త ధైర్యం చెప్పడంతో షూట్‌లో పాల్గొంది శ్రీదేవి. 1969లో వ‌చ్చిన తునైవాన్ అనే త‌మిళ చిత్రంలో శ్రీదేవి కెమెరా ఫేస్ చేసింది. ఇక తెలుగులో అనురాగాలు(1975) అనే చిత్రంలో గుర్తింపు వ‌చ్చే పాత్ర చేసింది. ఇందులో అంధురాలిగా , చాలా ఒబిడీయెంట్‌గా ఉండే పాత్ర పోషించింది.

ఇంక శ్రీదేవి త‌న త‌ల్లి తండ్రుల ప్రేమ పెళ్లి గురించి కూడా వివ‌రించింది. శ్రీదేవి త‌ల్లి రాజేశ్వ‌రి కారులో ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో కారు యాక్సిడెంట్ జ‌రిగింది. దీంతో లీగ‌ల్ కేసులో ఇరుక్కున్న రాజేశ్వ‌రి, లాయ‌ర్ ( శ్రీదేవి తండ్రి) ద‌గ్గ‌రికి వెళ్లి జరిగిన విష‌యాన్ని వివ‌రించింది. ఈ కేసు విష‌యంలో ప‌లు మార్లు క‌లిసిన వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించి చివ‌ర‌కి పెళ్ళి పీట‌ల వ‌ర‌కు వెళ్లింది. మా ఫాద‌ర్ చాలా జోవియల్‌గా ఉంటారు. మా అమ్మ‌ని క‌లిసిన తొలి సంద‌ర్భం గురించి అప్పుడ‌ప్పుడు చెబుతూ అమ్మ‌ని ఆట‌ప‌ట్టిస్తుంటారు. నేను మా ఫాద‌ర్‌లానే ఉంటాన‌ని , ప్ర‌వ‌ర్త‌న కూడా అలానే ఉంటుంద‌ని ప‌లువురు చెబుతుంటారు. ఇక పాలిటిక్స్ లో పోటీ చేయాల‌నే ఆలోచ‌న ఎప్పుడు రాలేదు. కాక‌పోతే ఒక‌సారి మా అంకుల్ కోసం క్యాంపెయిన్ చేశాను. అప్పుడు క్రౌడ్ చూసి భ‌య‌ప‌డ్డాను. ర్యాలీస్‌లో ప‌లుసార్లు స్పీచ్‌లు కూడా ఇచ్చాను. ఇక నేను మెచ్చే యాక్ట‌ర్ ఎవ‌రంటే శివాజీ గ‌ణేష‌న్ అని చెప్పుకొచ్చింది శ్రీదేవి.

హిందీ సినిమాలో బాగా డ్యాన్స్ చేసే వారికి మీరు ఏ రేటింగ్ ఇస్తారు అని అడ‌గ‌గా అమితాబ్ బ‌చ్చ‌న్‌లో గ్రేస్ ఉంటుంది.రిషీ క‌పూర్‌కి ఓ స్టైల్ ఉంటుంది. గోవిందా డ్యాన్స్ కాస్త వెరైటీగా ఉంటుంది. అనీల్ క‌పూర్ చాలా ఉత్సాహంగా స్టెప్స్ వేస్తారు. ఇక మాధురీ దీక్షిత్‌, త‌న డ్యాన్స్ లో స‌ప‌రేట్ స్టైల్ ఉంటుంద‌ని చెప్పుకొచ్చిన శ్రీదేవి ద‌క్ ద‌క్ డ్యాన్స్ ని చాలా అందంగా పిక్చ‌రైజ్ చేశారు. ఇందులో మాధురీ దీక్షిత్ డ్యాన్స్ అద్భుతం అని అంది. మీకు జ‌య‌ప్ర‌ద‌కి గ‌ట్టి పోటి ఉండేది క‌దా అనే ప్ర‌శ్న‌కి.. మేమిద్ద‌రం రెజ్లింగ్ మ్యాచ్ కోసం కుస్తీ ప‌డ‌లేదు. ఇండ‌స్ట్రీలో ప్ర‌తి ఒక్క‌రి మ‌ధ్య కాస్త కాంపిటీష‌న్ ఉంటుంది. అలానే మా ఇద్ద‌రి మ‌ధ్య కాస్త ఎక్కువ ఉండేది. ఇద్ద‌రం క‌లిసి టోఫా (1984), మావాలి (1983), మ‌క్‌స‌ద్ (1984) చిత్రాల‌లో న‌టించాము. కాని అప్పుడు అస్స‌లు మాట్లాడుకోలేదు. కాని అవ‌న్నీ వ‌ర్క్ వ‌ర‌కే. మా నాన్న గారు చ‌నిపోయిన‌ప్పుడు త‌ను ఇంటికి వ‌చ్చి నన్నుఓదార్చింది. అదో గొప్ప అనుభూతి అంటూ శ్రీదేవి సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఖ‌లీద్ మ‌హ‌మ్మ‌ద్‌కి ప‌లు విష‌యాల‌ని వెల్ల‌డించింది.

2158
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles