రేపు శ్రీదేవి సంస్మరణ స‌భ నిర్వ‌హించ‌నున్న కుటుంబ స‌భ్యులు

Sat,March 10, 2018 01:55 PM
sridevi prayer meeting at chennai

అందాల సుంద‌రి శ్రీదేవి మ‌ర‌ణించి అప్పుడే 14 రోజులు అయింది. ఆమె మ‌ర‌ణం ఇప్ప‌టికి అంద‌రినీ బాధిస్తూనే ఉంది. అమ్మ చ‌నిపోయింద‌న్న బాధ‌ని దిగ‌మింగుకొని రీసెంట్‌గా ద‌డ‌క్ చిత్ర షూటింగ్‌లో పాల్గొంది జాన్వీ . ఇక శ్రీదేవి కోరిక మేరకు ఆమె అస్ధిక‌ల‌ని హ‌రిద్వార్‌లోని గంగా న‌దిలో క‌లిపారు బోని క‌పూర్‌. శ్రీదేవి జ్ఞాప‌కాల‌ని త‌ల‌చుకుంటూ ఆ ఫ్యామిలీ ఎంత‌గానో రోదిస్తుంది. అయితే రేపు శ్రీదేవి సంస్మరణ స‌భని చెన్నైలో ఏర్పాటు చేశారు ఆమె కుటుంబ స‌భ్యులు. ఆల్వార్ పేట్‌లోని అద్యార్ పార్క్‌లో సాయంత్రం 6గం.ల‌నుండి 7.30ని.ల‌కు వర‌కు ఈ స‌భ జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మంలో జాన్వీ, ఖుషీ, బోనీ క‌పూర్‌ల‌తో పాటు క‌పూర్ ఫ్యామిలీ, మార్వా ఫ్యామిలీ త‌దిత‌రులు హాజ‌రు కానున్నారు. శ్రీదేవి ఫిబ్ర‌వ‌రి 24న రాత్రి దుబాయ్ లోని ఓ హోట్‌ల్‌లో ఉన్న‌ బాత్ ట‌బ్‌లో ప‌డి మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి 27న శ్రీదేవి పార్థివ దేహం ఇండియాకి చేరుకోగా, 28న ఆమె అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. శ్రీదేవి న‌టించిన చివ‌రి చిత్రం మామ్ కాగా, జీరో చిత్రంలోను ఓ కీల‌క పాత్ర పోషించిన‌ట్టు తెలుస్తుంది.

2613
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles