సైలెంట్ గా కంప్లీట్ అయిన శ్రీదేవి మూవీ

Tue,July 5, 2016 11:06 AM
sridevi mopleted silently

కొన్ని సినిమాలు సైలెంట్ గా వచ్చి సైలెంట్ గా వెళ్లిపోతుంటాయి. సినిమా ఎప్పుడు మొదలైందో ఎప్పుడు పూర్తైందో కూడా ఎవరికీ తెలియదు. తాజాగా నిన్నటి హీరోయిన్ శ్రీదేవి నటించిన బాలీవుడ్ సినిమా చడీ చప్పుడు కాకుండా పూర్తయిందట. శ్రీదేవి మెయిన్ రోల్ గా ఉండే పిక్చర్ ని ఆ మధ్య స్టార్ట్ చేశాడు బోనీకపూర్. తర్వాత సినిమా గురించే న్యూసే లేదు. ఇక తాజాగా ఈ చిత్రంను బోనీకపూర్ పూర్తి చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్ధికీ ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడట. బోనీకపూర్ తీసిన సినిమాకు మామ్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు చెబుతున్నారు. నిజం చెప్పాలంటే శ్రీదేవి మూవీ స్టార్ట్ కావడం కూడా చాలా సైలెంట్ గా జరిగింది. ఆ మూవీ స్టార్ట్ అయిన సంగతి కొద్దిమందికే తెలుసు. ఎలాంటి ప్రచారం, హడావుడి లేకుండా ఈ సినిమా చేయాలని శ్రీదేవి అనుకున్నదట. అందుకే ఎవరికీ తెలీకుండా షూటింగ్ కూడా పూర్తి చేసేశారు. రిలీజ్ డేట్ ఇచ్చి పబ్లిసిటీ మొదలు పెడతారని తెలుస్తోంది.

2190
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles