ప్రియా వారియర్ ‘శ్రీదేవి బంగ్లా’ నుండి మరో టీజ‌ర్ విడుద‌ల‌

Sun,March 17, 2019 07:43 AM
SRIDEVI BUNGALOW  Official Teaser 2

కన్నుగీటుతో కోట్లాది ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న మ‌ల‌యాళీ భామ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌. ఆమె న‌టించిన మ‌ల‌యాళ చిత్రం ఒరు ఆదార్ ల‌వ్ ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఇది బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. ప్ర‌స్తుతం శ్రీదేవి బంగ్లా అనే బాలీవుడ్ చిత్రం చేస్తుంది. ఈ చిత్రం ప్రియా ప్ర‌కాశ్‌కి తొలి బాలీవుడ్ మూవీ కాగా, ఈ చిత్రాన్ని ప్ర‌శాంత్ మాంబుల్లి తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్ర టీజ‌ర్‌లోని కొన్ని స‌న్నివేశాలపై ప‌లు వివాదాలు చెల‌రేగాయి. ఓ స‌న్నివేశంలో ప్రియ బాత్ టబ్ లో అనుమానాస్పద స్థితిలో కాళ్లు తేలుతూ క‌నిపించ‌గా, దీనిని శ్రీదేవి మ‌ర‌ణ నేప‌థ్యంలో తీసార‌నే భావ‌న అంద‌రిలో క‌లిగింది. ఈ క్ర‌మంలో బోని క‌పూర్ చిత్ర బృందానికి నోటీసులు కూడా పంపారు. క‌ట్ చేస్తే తాజాగా మ‌రో టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో నాకు ఎంత మంది ప్రపోజ్‌ చేశారో నీకు తెలుసా?’ అని ప్రియ ఓ యువకుడ్ని ప్రశ్నిస్తున్న డైలాగ్‌తో టీజ‌ర్‌ ప్రారంభమైంది. స‌న్నివేశాలు కూడా అభిమానుల‌ని ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. మీరు ఈ టీజ‌ర్ చూసి ఎంజాయ్ చేయండి.


1543
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles