ప్రియా వారియర్ ‘శ్రీదేవి బంగ్లా’ టీజర్

Mon,January 14, 2019 10:38 PM

ముంబై: తనదైన స్టైల్ లో కన్ను కొట్టి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఈ ముద్దుగుమ్మ తాజాగా ‘శ్రీదేవి బంగ్లా’ అనే బాలీవుడ్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తుంది. ప్రశాంత్‌ మాంబుల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ప్రియా ప్రకాశ్ స్టార్ హీరోయిన్ పాత్రలో నటిస్తోంది.

ఓ చిన్నారి శ్రీదేవి (ప్రియాప్రకాశ్ పాత్ర) దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్ అడిగే సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. మీకు ఇష్టమైన నటి ఎవరు అని అడగ్గా..నాకు ఇష్టమైన నటిని నేనే అని శ్రీదేవి చెబుతుంది. చివరగా ఓ బాత్ టబ్ లో అనుమానాస్పద స్థితిలో కాళ్లు తేలుతూ కనిపించే సన్నివేశం ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. జీవితం సాఫీగా సాగుతున్న ఆ స్టార్ హీరోయిన్ కు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.

3426
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles