‘శ్రీ శ్రీ’ ట్రైలర్ విడుదల

Sat,May 28, 2016 11:04 AM
Sri Sri Theatrical Trailer

తన సినిమాల ద్వారా అభిమానులను చైతన్యవంతులని చేయడమే కాదు, మంచి వినోదంతోను ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయనున్న నటుడు సూపర్ స్టార్ కృష్ణ. ఏడు పదుల వయస్సులోను ఎంతో ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు కృష్ణ. తాజాగా ముప్పలనేని శివ దర్శకత్వంలో శ్రీశ్రీ అనే చిత్రాన్ని చేశారు. ఈ మూవీ ఆడియో వేడుక జరిగి చాన్నాళ్లయిన రిలీజ్ మాత్రం పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అయితే తాజాగా శ్రీశ్రీ మూవీ రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. మే 31న కృష్ణ పుట్టిన రోజు కనుక ఆయన బర్త్ డే కానుకగా జూన్ 3న సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అలనాటి శ్రీశ్రీ భావజాలం నేటి సగటు మనిషిలో పుడితే అన్నదే కథాంశం అని దర్శకుడు తెలిపాడు. 50 ఏళ్ళ తన సినీ ప్రస్థానంలో ఎన్నో అద్బుతమైన సినిమాలు చేసిన కృష్ణకు శ్రీ శ్రీ మూవీ కూడా మరింత పేరు ప్రఖ్యాతలు తెస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రానికి మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వగా విజయ నిర్మల, నరేష్, సుధీర్ బాబు తదితరులు ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. ఇక తాజాగా సూపర్ స్టార్ కృష్ణ స్వర్ణోత్సవ చిత్రం శ్రీశ్రీకు సంబంధించి ఓ ట్రైలర్ ను విడుదల చేసారు. దానిపై మీరు ఓ లుక్కేయండి.

2048
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles