బాధ‌ను అనుభ‌వించ‌డానికి అవ‌కాశ‌మివ్వండి: శ్రీదేవి ఫ్యామిలీ

Thu,March 1, 2018 08:48 AM
sri devi family gives a statement

దివంగ‌త న‌టి శ్రీదేవి మ‌ర‌ణం కుటుంబ స‌భ్యుల‌తో పాటు అభిమానుల‌కి తీర‌ని శోకాన్ని మిగిల్చింది. ఇక ఆమె మృతికి సంబంధించి వ‌చ్చిన వార్త‌లు ప్ర‌తి ఒక్క‌రిలో ఎంతో ఆందోళ‌న‌ని క‌లిగించాయి. శ్రీదేవి అంత్య‌క్రియ‌ల అనంతరం క‌పూర్‌, అయ్యప్ప‌న్‌, మార్వా కుటుంబ స‌భ్యులు సంయుక్త ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. దీనిని అనీల్ క‌పూర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశారు. కొద్ది రోజులుగా మీడియాలో శ్రీదేవికి సంబంధించి ప‌లు ర‌కాలుగా వార్త‌లు ప్ర‌సార‌మ‌య్యాయి. శ్రీదేవి ఇక మాతో లేర‌ని బాధ‌ని ఫ్యామిలీ అంతా క‌లిసి అనుభ‌వించ‌డానికి కొంత అవ‌కాశ‌మివ్వండి. కొద్ది రోజ‌లు మీడియా మాకు దూరంగా ఉండాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాము. ఇన్నాళ్ళు ఎంతో గౌరవంగా బ్ర‌తికిన శ్రీదేవి , ఇక‌పై కూడా తాను అంద‌రి మ‌న‌సుల‌లో అంతే గౌరవంగా ఉండాలని కోరుకుంటున్నామ‌ని తెలిపారు. కొద్ది రోజులుగా మా ఫ్యామిలీ విష‌మ ప‌రీక్ష ఎదుర్కొంటుంది. దుఃఖించేందుకు అయిన కొంత ప్ర‌శాంత‌త కావాల‌ని మేము కోరుకుంటున్నాము. క‌ష్టకాలంలో అండ‌గా నిలిచిన శ్రీదేవి స్నేహితులు, తోటి న‌టీన‌టులు, అభిమానులు, మీడియాఇలా ప్ర‌తి ఒక్క‌రికి పేరు పేరునా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాము. జాన్వీ, ఖుషీకి మా కుటుంబం ఎప్ప‌టికి చేదోడు వాదోడుగానే ఉంటుంది. శ్రీదేవిపై చూపించిన ప్రేమ‌ని త‌న పిల్ల‌ల‌పై కూడా చూపించి, వారికి త‌ల్లిలేని బాధ నుండి కోలుకునేలా చేద్ధాం. మ‌న‌మంద‌రం వారికి అండ‌గా నిలిచి శ్రీదేవి క‌లలు క‌న్న భ‌విష్య‌త్‌ని వారికి అంద‌జేద్ధాం అంటూ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు శ్రీదేవి బంధువులు.


3818
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles