ఇలా అయితే బిగ్‌బాస్ నుంచి వెళ్లిపోతా!

Tue,September 18, 2018 01:41 PM
Sreesanth threatened to leave the Big Boss House after housemates taunt him

ముంబై: హిందీలో బిగ్‌బాస్ 12 సీజన్ మొదలై రెండు రోజులు కూడా కాలేదు. అప్పుడే ఓ వివాదం మొదలైంది. ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్న క్రికెటర్ శ్రీశాంత్.. హౌజ్ నుంచి వెళ్లిపోతానంటూ బెదిరిస్తున్నాడు. ఓ టాస్క్ విషయంలో టీమ్ మేట్స్‌తో గొడవ జరగడంపై శ్రీశాంత్ అసంతృప్తిగా ఉన్నాడు. బిగ్‌బాస్ షోలో హౌజ్‌మేట్స్‌కు ఏదో ఒక టాస్క్ ఇస్తారన్న సంగతి తెలుసు కదా. అందులో భాగంగా శ్రీశాంత్‌కూ ఓ టాస్క్ ఇచ్చారు. అయితే దానిపై పెద్దగా ఆసక్తి చూపని అతడు.. అందులో పార్టిసిపేట్ చేయడానికి నిరాకరించాడు. హౌజ్‌మేట్స్ చెప్పినా, బిగ్‌బాస్ వార్నింగ్ ఇచ్చినా శ్రీశాంత్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో బిగ్‌బాస్ ఆ టాస్క్‌ను రద్దు చేశాడు. దీనిపై మోడరేటర్స్‌గా వ్యవహరించన శిల్పా షిండే, కరణ్ పటేల్‌తోపాటు ఇతర హౌజ్‌మేట్స్ కూడా అతనిపై తీవ్రంగా మండిపడ్డారు. అందరూ అతనితో వాగ్వాదానికి దిగారు.

దీంతో అలకబూనిన శ్రీశాంత్ ఇలా అయితే హౌజ్ నుంచి వెళ్లిపోతా అంటూ బెదిరించాడు. రెండు రోజుల్లోనే ఎవరు ఎలాంటి వాళ్లో తాను అంచనా వేయలేనని శ్రీశాంత్ అన్నాడు. ఇలాంటి టాస్క్‌లే గేమ్‌లో ఉంటాయంటే మాత్రం తాను కచ్చితంగా గేమ్‌లో ఉండనని స్పష్టంచేశాడు. గతంలో ఇలా ఝలక్ దిఖ్‌లాజా షోలో పాల్గొన్న శ్రీశాంత్.. అందులో నుంచి తనను ఎలిమినేట్ చేయడంతో అలిగి వాకౌట్ చేశాడు. ఇప్పుడు బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లే ముందు ఈసారి తాను అలా చేయబోనని అతను చెప్పడం విశేషం. విజేతగానే తిరిగి వస్తానని అతను అన్నాడు. కానీ రెండు రోజులకే మళ్లీ వెళ్లిపోతా అని బెదిరిస్తున్నాడు. మరి ఈ వివాదంపై వీకెండ్ షోలో సల్మాన్‌ఖాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

8844
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles