పటాస్ ప్రోగ్రాంకి కామా పెట్టిన శ్రీముఖి

Wed,May 15, 2019 11:01 AM

ప్ర‌స్తుతం బుల్లితెరపై అస‌సూయ‌, ర‌ష్మి త‌ర్వాత ఆ రేంజ్‌లో త‌న‌దైన మాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బొద్దుగుమ్మ యాంక‌ర్ శ్రీముఖి. చిన్న చిత‌కా సినిమాల‌లో న‌టించిన ఈ అమ్మ‌డికి పెద్ద‌గా క్రేజ్ రాలేదు. ప‌టాస్ అనే కార్య‌క్ర‌మంతో ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయింది. రాముల‌మ్మ‌గా శ్రీముఖి ఫుల్ ఫేమస్. ప‌టాస్ షోలో శ్రీముఖి త‌న మాట‌ల‌తోనే కాదు గ్లామ‌ర్‌తోను అల‌రించింది. స్టూడెంట్స్‌తో ఈ అమ్మ‌డు చేసే ఫ‌న్ ఆడియ‌న్స్‌ని రంజింపజేసింది. ప‌టాస్ కార్య‌క్ర‌మం ఫుల్ హిట్ కావ‌డంతో ఈ మ‌ధ్య శ్రీముఖి, ర‌వి హోస్ట్‌గా ప‌టాస్ 2 కూడా మొద‌లు పెట్టారు. అయితే ప‌టాస్ షోకి కొద్ది రోజులు తాను బ్రేక్ ఇవ్వ‌బోతున్న‌ట్టు వీడియో ద్వారా తెలిపింది శ్రీముఖి. నిర్వాహకుల అనుమతితోనే తాను బ్రేక్ తీసుకుంటున్నన్నట్టు పేర్కొంది. త‌న‌ని ఇంత‌గా ఆద‌రించిన బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి కూడా ఈ విష‌యం తెలియాల‌నే ఈ వీడియో చేస్తున్న‌ట్టు తెలిపింది శ్రీముఖి. ప‌టాస్ షో త‌న హృద‌యానికి చాలా ద‌గ్గ‌రైంద‌ని చెబుతూ, నిర్మాణ సంస్థ మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది. మ‌రి శ్రీముఖి కొన్నాళ్ళు బ్రేక్ తీసుకోవ‌డంతో ప‌టాస్ స్టేజ్‌పై ర‌వికి జోడీగా ఏ యాంకర్ అల‌రిస్తుందో చూడాలి .
8087
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles