ఇండస్ట్రీకు రిటైర్మెంట్ ప్రకటించినున్న ప్రముఖ నిర్మాత

Tue,January 12, 2016 03:45 PM
sravanthi ravi kishore says good bye to industry

తెలుగు సినీ పరిశ్రమలో కొందరు సెలబ్రిటీస్ ఒక్కొక్కరు తమ రిటైర్మెంట్‌ను ప్రకటిస్తుండగా, తాజాగా ఈ లిస్ట్‌లో స్టార్ ప్రొడ్యూసర్ స్రవంతి రవి కిషోర్ చేరారు. బాహుబలి చిత్రం తర్వాత తన రిటైర్మెంట్ ఉంటుందని ఇటీవలే కీరవాణి తెలియజేయగా, తాజాగా స్రవంతి రవి కిషోర్ తీసుకున్న నిర్ణయం పలువురు సినీ అభిమానులను కలవరపరుస్తోంది.

స్రవంతి రవికిషోర్ తన బ్యానర్‌లో అద్బుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా, ఈ బ్యానర్‌లో నేను శైలజ చిత్రం తాజాగా విడుదలై మంచి సక్సెస్‌ను సాధించింది. ఈ చిత్రంలో రామ్, కీర్తి సురేష్‌లు హీరో హీరోయిన్‌లుగా నటించగా నేను శైలజ చిత్రం కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కింది. అయితే ఈ చిత్రమే తనకు నిర్మాతగా చివరి చిత్రమని, ఇటీవల జరిగిన నేను శైలజ సక్సెస్ మీట్‌లో తెలిపారు రవికిషోర్.

స్రవంతి రవికిషోర్ తాను నిర్మాణ రంగానికి దూరంగా ఉన్న తన బ్యానర్ మాత్రం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు . రామ్ సోదరుడు కృష్ణ చైతన్య స్రవంతి బ్యానర్‌కు ఫ్యూచర్ భాద్యతలను తీసుకోనున్నట్టు రవికిషోర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే రామ్ త్వరలో కిషోర్ తిరుమలతో మరో చిత్రం చేయనుండగా, ఈ సినిమాతోనే కృష్ణ చైతన్య నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగు పెట్టనున్నట్టు సమాచారం.

2947
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles