స్పైడర్ బుకింగ్స్ మొదలు.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్స్

Sun,September 24, 2017 08:55 AM
spyder ticets sale as hot tickets

స్టార్ డైరెక్టర్ మురుగదాస్- సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం స్పైడర్. సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ భాషలలో విడుదల కానున్న ఈ సినిమాకి బుకింగ్స్ మొదలయ్యాయి. యూఎస్‌లో జరగనున్న ప్రీమియర్ షో టికెట్స్ అయితే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మహేష్‌కి ఓవర్సీస్‌లోను ఫుల్ క్రేజ్ ఉండడంతో తొలి రోజు అక్కడ కూడా భారీ వసూళ్ళు రావడం ఖాయమని చెబుతున్నారు ట్రేడ్ ఎనలిస్ట్‌లు. ఇక తెలుగు రాష్ర్టాలతో పాటు తమిళ రాష్ట్రంలోని కొన్ని థియేటర్స్‌లో అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. అభిమానులు టిక్కెట్స్ కోసం థియేటర్స్ దగ్గర క్యూలు కట్టారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన స్పైడర్ చిత్రం వారం రోజులలో రికార్డు కలెక్షన్స్ సాధించడం ఖాయమని అంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్ జె సూర్య విలన్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

3620
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS