పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న విజయ్ 'హీరో'

Sun,May 19, 2019 11:44 AM

సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కి మాంచి థ్రిల్ ఇస్తున్నాడు. ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్ చిత్రంతో పాటు క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజ‌య్. ఈ రెండు చిత్రాలు 2019లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఇక ఆనంద్ అన్నామ‌లై ద‌ర్శ‌క‌త్వంలో హీరో అనే సినిమా చేస్తున్నాడు విజ‌య్. మైత్రి మూవీ మేక‌ర్స్ బేన‌ర్‌లో రూపొంద‌నున్న ఈ చిత్రం సౌత్‌లోని అన్ని భాష‌ల‌లో రిలీజ్ కానుంది. తాజాగా చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. కొర‌టాల శివ క్లాప్ కొట్ట‌గా , గొట్టిపాటి ర‌వి స్విచ్ ఆన్ చేశారు. మ‌రి కొద్ది రోజుల‌లో ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్ళ‌నున్నారు. స్పోర్ట్స్ మ్యూజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రంలో విజయ్ దేవ‌ర‌కొండ బైక్ రేస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడ‌ట‌. పేట చిత్రంలో న‌టించిన ముంబై భామ మాళ‌విక మోహ‌న‌న్ విజ‌య్‌తో జోడి క‌ట్ట‌నుంది. అర్జున్ రెడ్డి సినిమాతో అన్ని భాష‌ల‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ బైలింగ్యువ‌ల్ ప్రాజెక్ట్‌తో మ‌రింత‌ ప‌ట్టు బిగించాల‌ని చూస్తున్నాడు.1793
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles