షారూఖ్ సాంగ్‌ని స్పూఫ్ చేసిన ఇండోనేషియా ఫ్యాన్స్.. వీడియో వైర‌ల్‌

Sun,March 31, 2019 11:25 AM
spoof video of Kuch Kuch Hota Hai title track

బాలీవుడ్ చిత్రాలు అందులో న‌టించిన స్టార్స్‌కి ప్రంప‌చ వ్యాప్తంగా ఆద‌ర‌ణ ఉంటుంద‌నే సంగ‌తి తెలిసిందే. ఇక షారూఖ్ ఖాన్ సంగ‌తి అయితే ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న రొమాంటిక్ చిత్రాల‌కి భారీ ప్రేక్ష‌కాద‌ర‌ణ ఉంటుంది. తాజాగా ఇండోనేషియాకి చెందిన షారూఖ్ అభిమానులు ‘కుచ్ కుచ్ హోతాహై’.. సినిమాలో ‘‘తుమ్ పాస్ ఆయే.. యు ముస్కురాయే’’ పాటకి స్పూఫ్ చేశారు. చిత్రంలో న‌టించిన షారుఖ్, కాజోల్, రాణీ ముఖర్జీలు సాంగ్‌లో ఎలా ప్ర‌ద‌ర్శ‌న చేశారో ఇండోనేషియ‌న్స్ కూడా అలానే త‌మ హావభావాల‌ని ప్ర‌ద‌ర్శించి నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో 1.2 మిలియ‌న్‌కి పైగా వ్యూస్ రాబ‌ట్టింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా కుచ్ కుచ్ హోతా హై కాగా, ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే



2011
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles