స్పైడ‌ర్ మ్యాన్ సృష్టిక‌ర్త స్టాన్ లీ ఇక‌లేరు..

Tue,November 13, 2018 08:26 AM
Spider Man creator Stan Lee dies at age 95

లాస్ ఏంజిల్స్: స్పైడ‌ర్ మ్యాన్‌, ఎక్స్‌-మెన్‌, థోర్‌, ఐర‌న్ మ్యాన్‌, బ్లాక్ ప్యాంథ‌ర్, ద ఫెంటాస్టిక్ ఫోర్ లాంటి సూప‌ర్ హీరో క్యారెక్ట‌ర్ల‌ను సినీ ప్రేక్ష‌కులకు అందించిన మేటి ర‌చ‌యిత‌, ఎడిట‌ర్‌, ప‌బ్లిష‌ర్‌ స్టాన్ లీ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 95 ఏళ్లు. మార్వెల్ కామిక్స్ కోసం ఆయ‌న 1961లో తొలిసారి ద ఫెంటాస్టిక్ ఫోర్ క్యారెక్ట‌ర్ల‌ను క్రియేట్ చేశారు. ఆ త‌ర్వాత స్పైడ‌ర్ మ్యాన్‌, ద ఇంక్రెడిబుల్ హ‌ల్క్ లాంటి సూప‌ర్ హీరో క్యారెక్ట‌ర్ల‌నూ సృష్టించాడు. లాస్ ఏంజిల్స్‌లోని సిడార్స్ సినాయ్ మెడిక‌ల్ సెంట‌ర్‌లో స్టాన్ లీ చివ‌ర శ్వాస విడిచారు. హాలీవుడ్‌లో ఫాద‌ర్ ఆఫ్ పాప్ క‌ల్చ‌ర్‌గా స్టాన్ లీకి గుర్తింపు ఉన్న‌ది. గ‌త ఏడాది స్టాన్ లీ భార్య అనారోగ్యంతో క‌న్నుమూశారు. టాప్ ఆర్టిస్టులు జాక్ కిర్బీ, స్టీవ్ డిట్కోతో స్టాన్ లీ ప‌నిచేశారు. కామిక్ క్యారెక్ట‌ర్ల‌ను సృష్టించ‌డంతో స్టాన్ కీల‌క పాత్ర పోషించాడు. సూప‌ర్ హీరో క్యారెక్ట‌ర్ల‌కు అన్ని హంగుల‌ను అద్దింది ఈయ‌నే.

1339
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS