రానా ఆరోగ్యంపై వ‌స్తున్న వార్తలు అవాస్త‌వం

Tue,June 19, 2018 09:05 AM
Speculations and rumours regarding Rana Daggubati reaction

బాహుబ‌లి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో రానా ద‌గ్గుబాటి. ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న రానా త్వ‌ర‌లో త‌న కుడి క‌న్ను ఆప‌రేష‌న్ చేయించుకోనున్నాడ‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. అయితే బ్ల‌డ్ ప్రెష‌ర్ వ‌ల‌న స‌ర్జరీ కొంత ఆల‌స్య‌మైంది. అంతేకాదు ఆయ‌న కిడ్నీ సంబంధింత వ్యాధితో కూడా బాధ‌ప‌డుతున్నారంటూ పుకార్లు షికారు చేశాయి. దీనిపై రానా స్పందించాడు .త‌న‌కు బ్ల‌డ్ ప్రెషర్ స‌మస్య ఉంద‌న్న రానా అందుకు సంబంధించి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న‌ట్టు చెప్పాడు. ఈ కార‌ణంగానే క‌న్ను ఆప‌రేష‌న్ లేట్ అయింద‌ని అన్నాడు. వీటికి మంచి త‌న‌కు ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు లేవంటూ పుకార్ల‌పై క్లారిటీ ఇచ్చాడు రానా .

చివ‌రిగా నేనే రాజు నేనే మంత్రి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రానా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత నేపధ్యంలో ‘1945’ అనే చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా చేయ‌నున్నాడు . ఇదే కాక పీరియడ్ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రంలో కేరళ ట్రావెన్కోర్ ప్రాంతానికి చెందిన మహారాజ తిరునాళ్ మార్తాండ్ వర్మ పాత్ర పోషించనున్నాడు . ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో రూపొందనుంది. 1971లో హిందీలో వచ్చిన హథీ మేరీ సాథీ రీమేక్ చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ త‌దుప‌రి షెడ్యూల్ రానా కంటి ఆప‌రేష‌న్ పూర్తైన త‌ర్వాతే ఉంటుంది. ఇవే కాక గుణశేఖర్ డైరెక్షన్ లో హిరణ్యకశ్యప అనే చిత్రం కూడా చేయనున్నట్టు తెలుస్తుంది. బాల డైరెక్షన్లోను రానా ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. వీటి త‌ర్వాత నేనే రాజు నేనే మంత్రి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన తేజ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌నున్నాడు రానా. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ నిర్మించ‌నున్న ఈ సినిమాలో రానా ఎయిర్ ఫోర్స్ అధికారిగా కనిపించ‌నున్నాడ‌ని అంటున్నారు.

2747
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles