వ‌ర‌ల్డ్ మ్యూజిక్ డే సంద‌ర్భంగా దేవిశ్రీ స్పెష‌ల్ వీడియో

Thu,June 21, 2018 11:26 AM
Special Video Shared By Devi Sri Prasad On The World Music Day

సంగీతానికి పెద్ద పెద్ద కొండ‌లు, రాళ్ళు క‌రుగుతాయి అంటారు. ఇప్పుడు ఆ సంగీతం మనిషి జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. శ్రమలో భాగమైన గీతాలు జానపదులుగా విలసిల్లాయి. అవి ప్రపంచాన్ని కదిలించాయి. ఫోక్ నుంచి రాక్ వరకు ఎన్నెన్నో కొత్త ఒరవడులను తనలో ఇముడ్చుకున్న సంగీతం అన్ని వయసుల వారినీ అలరిస్తుంది. అలాంటి సంగీతానికి ఒక రోజుంది. జూన్ 21న ప్రపంచ సంగీత దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ప్రముఖ కళాకారులు ప్రదర్శనలతో అలరించనున్నారు. మ‌రి కొంద‌రు సంగీతంతో త‌మ‌కున్న అనుభూతుల‌ని నెమ‌ర‌వేసుకుంటున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ ప్ర‌పంచ సంగీత దినోత్సవం సంద‌ర్బంగా ఓ వీడియో షేర్ చేశాడు. దీనికి క్యాప్ష‌న్‌గా సంగీతం ప్ర‌తిచోట‌, ప్రతి వ‌స్తువులో ఉంటుంద‌ని అన్నాడు. యూఎస్‌లో క‌న్స‌ర్ట్ చేసిన‌ప్పుడు త‌న టీం అంద‌రు మేక‌ప్ బాక్స్‌, ల‌గేజ్ ట్రాలీ లాంటి వ‌స్తువులతో సంగీతం పుట్టించి అక్క‌డి ప్రేక్ష‌కుల‌ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేశారు. దీని కోసం వారు ప్రాక్టీస్ చేసిన వీడియో షేర్ చేశాడు దేవి. ఇది సంగీత అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. మీరు ఆ వీడియోపై ఓ లుక్కేయండి.


1478
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS