ర‌జ‌నీకాంత్ బ‌ర్త్ డే రోజు ఫ్యాన్స్ కి సూప‌ర్ ట్రీట్

Thu,June 22, 2017 03:12 PM
special treat to rajanikanth fans on dec 12

దేశ విదేశాల‌లో ఎంతో మంది మ‌న‌సులు గెలుచుకున్న స్టార్ హీరో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్. డిసెంబ‌ర్ 12న ర‌జ‌నీకాంత్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా అభిమానులు ఆ రోజుని పండుగ‌లా జ‌ర‌పాల‌ని ఇప్ప‌టి నుండే ప్లాన్స్ వేస్తున్నారు. ఇక ర‌జ‌నీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో 2.0 తెర‌కెక్కించిన శంక‌ర్ .. త‌లైవా బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్ర ట్రైల‌ర్ ని విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నాడు. దాదాపు 400 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన 2.0 చిత్రం ప్ర‌స్తుతం సీజీ వ‌ర్క్స్ జ‌రుపుకుంటుండ‌గా, జ‌న‌వ‌రి 25, 2018న విడుదల కానుంది. ర‌జనీకాంత్, అమీ జాక్స‌న్, అక్ష‌య్ కుమార్ ముఖ్య పాత్ర‌ల‌లో రూపొందిన 2.0 చిత్ర ఆడియోని అక్టోబ‌ర్ లో విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు. 2.0 సినిమా హిందీ హక్కులు 80 కోట్లకి అమ్ముడు కాగా, ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రేటు కూడా ఆశ్చర్య చకితులను చేస్తోంది. అన్ని భాషల్లోను కలుపుకొని ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ టీవీ సంస్థ 110 కోట్లకి సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక డిసెంబ‌ర్ 12 న ర‌జ‌నీకాంత్ త‌న పార్టీ పేరు, ప్ర‌ణాళిక‌లు వివరాస్తాడ‌ని చెబుతున్నారు. మ‌రో వైపు ర‌జనీకాంత్ ప్ర‌స్తుతం చేస్తున్న కాలా సినిమా టీజ‌ర్ నీ కూడా ఆ రోజే విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. మొత్తానికి ఈ సారి త‌లైవా బ‌ర్త్ డే ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇస్తుంద‌నడంలో ఎలాంటి సందేహం లేదు.



2039
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles