స్పెష‌ల్ సాంగ్‌తో అల‌రించ‌నున్న ఆర్ఎక్స్ 100 బ్యూటీ

Thu,January 31, 2019 01:05 PM
special performance by Payal Rajput in sita

ఆర్ఎక్స్ 100 చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన భామ పాయ‌ల్ రాజ్ పుత్‌. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు ఇటు తెలుగు అటు త‌మిళ సినిమాల‌ని సెల‌క్టివ్‌గా ఎంపిక చేసుకుంటుంది. డిస్కోరాజా అనే చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం అందుకున్న ఈ అమ్మ‌డు తాజాగా ఓ మూవీలో స్పెష‌ల్ సాంగ్ చేసేందుకు సిద్ధ‌మైంద‌ని స‌మాచారం. తేజ దర్శకత్వంలో యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, స్టార్ హీరోయిన్ జంటగా సీత అనే చిత్రం తెర‌కెక్కుతుంది. ఇందులో కాజ‌ల్ టైటిల్ రోల్ పోషిస్తుండ‌గా , షూటింగ్ తుది ద‌శ‌కి చేరుకుంది. అయితే ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ నర్తించనుందట‌. తర్వలోనే ఈ సాంగ్ ను చిత్రీకరించనున్నారని అంటున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. మార్చిలో ఈ చిత్రం విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.

2320
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles