తాత బాటలో మనవడు..మీసం తిప్పిన రావణుడు

Sat,May 20, 2017 08:42 AM
special greeting comes from ntr fans

నటననే ఊపిరిగా చేసుకున్ననందమూరి నట దిగ్గజాల వంశం నుంచి వచ్చిన యంగ్ టైగర్ జూనియర్ నందమూరి తారక రామారావు బర్త్ డే నేడు. ఈ రోజుతో జూనియర్ 34వ పడిలోకి అడుగు పెట్టాడు. తాత ఎన్ టి రామారావు పేరు పెట్టుకున్న జూనియర్ కు అందంలోనూ, నటనలోనూ ఆయన పోలికలొచ్చాయి. తాత చిన్నప్పుడు నాటకాల ద్వారా సినిమాల్లోకి వస్తే ఈ జూనియర్ చిన్నప్పుడే బాలనటుడిగా మూవీ ఎంట్రీ ఇచ్చాడు.

జూనియర్ తన ఎనిమిదో ఏటనే అంటే 1991లో బ్రహ్మర్షి విశ్వామిత్ర లో చిన్నప్పటి భరతుడిగా వేశాడు. ఆరేళ్ల గ్యాప్ తర్వాత 1997లో రామాయణం సినిమాలో రాముడిగా నటించాడు. చక్కటి ముఖ వర్చస్సు ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తాతా లాగే ఆ పాత్రకు చక్కగా సరిపోయాడు. బాల్యం గడిచి వయసు వచ్చాక … మొదటిసారి 2001లో నిన్ను చూడాలని సినిమాలో హీరోగా నటించాడు

హీరోగా జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ లు, హిట్స్ ఇచ్చాడు. స్టూడెంట్ నంబర్ 1 తో హిట్ పెరేడ్ మొదలుపెట్టి బృందావనం, బాద్ షా వంటి బ్లాక్ బస్టర్లు, ఆది, యమదొంగ, అదుర్స్, సింహాద్రి. రాఖీ వంటి హిట్స్ ఎన్టీఆర్ తన అకౌంట్ లో వేసుకున్నాడు. రీసెంట్ గా టెంపర్ , నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్ హట్రిక్ విజయాలు సాధించాడు. ప్రస్తుతం కె.ఎస్.ర‌వీంద్ర (బాబీ) దర్శకత్వంలో జై లవకుశ అనే మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఇందులో రాజసం, రౌద్రం కలిపిన రావణుడిగా కనిపిస్తున్నాడు.

ఎన్ టి రామారావు మంచి నటుడు మాత్రమే కాదు, కూచిపూడి డాన్సర్, సింగర్ కూడా. మంచి డైలాగ్ మాడ్యులేషన్ తో …. సరదాగా, అమాయకంగా నటించడమే కాక యాక్షన్ హీరోగా కూడా చేసి …. ఎన్ టీఆర్ లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయినా, యాక్షన్ సినిమా అయినా చేసి మెప్పించే జూనియర్ ఎన్ టిఆర్ మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు.

1821
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS