నాగ్ మూవీ సెట్ లో అనుష్క స్పెషల్ డ్యాన్స్

Tue,September 6, 2016 07:38 AM
special dance performance on the sets of Om Namo Venkatesaya

అరుంధతి, రుద్రమదేవి, దేవసేన లాంటి పవర్‌ఫుల్ పాత్రలు పోషించిన అనుష్క తాజాగా తెరకెక్కుతున్న ఓం నమో వెంకటేశాయ చిత్రంలో మహా భక్తురాలు కృష్ణమ్మగా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమాలోని అనుష్క లుక్‌ని రివీల్ చేశారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. వినాయక చవితి సందర్భంగా అనుష్క షూటింగ్‌కి ముందు తన నృత్య బృందంతో స్పెషల్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చిందట. దీంతో అందరు పండుగ వాతావరణంలోకి వెళ్ళిపోయారట. అయితే ఈ ప్రదర్శనను రాఘవేంద్రరావు , డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ ఎస్. గోపాల్, రాజు సుందరం అభినందించారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఆ ప్రదర్శనకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా పోస్ట్ చేశారు.


2211
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles