ఎస్పీ బాలు కుటుంబంలో విషాదం

Mon,February 4, 2019 01:01 PM
sp balasubrahmanyam mother passes away in nellore

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి శకుంతలమ్మ సోమవారం ఉదయం 7:10 గంటలకు నెల్లూరులోని తిప్పరాజువారి వీధిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ ఉదయం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఎస్పీ బాలు.. సంగీత కచేరి నిమిత్తం లండన్‌లో పర్యటిస్తున్నారు. తల్లి మరణవార్త తెలుసుకున్న బాలు.. హుటాహుటిన స్వగ్రామానికి బయల్దేరారు. రేపటి వరకు బాలు నెల్లూరు రానున్నారు. రేపు నెల్లూరులో శకుంతలమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక బాలు సోదరి శైలజ నిన్ననే నెల్లూరు వచ్చారు. తల్లి మృతదేహాన్ని చూసి శైలజ కన్నీటి పర్యంతమయ్యారు.

6938
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles