క‌మ‌ల్ సినిమాలో కొరియ‌న్ భామ ?

Fri,January 11, 2019 09:06 AM

జీనియ‌స్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌- లోకనాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్‌లో సినిమా అంటే ఏ రేంజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన భార‌తీయుడు చిత్రం రికార్డులు తిర‌గరాయ‌డంతో 22 ఏళ్ళ త‌ర్వాత ఈ మూవీకి సీక్వెల్ చేస్తున్నారు. ఇటీవ‌ల ఈ చిత్రం సీక్వెల్ పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. జ‌న‌వ‌రి 18న పొల్లాచ్చిలో షూటింగ్ ప్రారంభం కానుంది. రూ.180 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది. తెలుగు, తమిళం, హిందీతోపాటు ఇతర భారతీయ భాషల్లోనూ ఈ చిత్రాన్ని ఏక కాలంలో తీయాలని నిర్మాత‌లు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇందులో కమల్‌హాసన్‌కి జోడీగా కాజల్ న‌టించ‌నున్నారు .దుల్కర్‌ సల్మాన్‌ కీలక పాత్రలో, అజయ్‌ దేవ్‌గణ్‌ నెగటివ్‌ పాత్రలో నటిస్తారని సమాచారం.


ఇండియ‌న్ 2 చిత్రానికి కొంచెం కొరియ‌న్ ట‌చ్ కూడా ఇవ్వాల‌ని భావించిన శంక‌ర్ కొరియ‌న్ భామ సూజీ బే ని కీల‌క పాత్ర కోసం తీసుకున్నార‌ట‌. క‌థానుసారం చిత్రంకి సంబంధించిన కొంత షూటింగ్ తైవాన్‌లో జ‌ర‌గ‌నుంది. ఆ టైంలో సూజీ చిత్ర యూనిట్‌తో క‌ల‌వ‌నుంద‌ని తెలుస్తుంది. ఈ చిత్రం కోసం హాలీవుడ్‌ మేకప్ మేన్‌లు పలువురు చెన్నైకి వచ్చినట్లు సమాచారం. ‘భారతీయుడు’లో తాను పోషించిన సీబీఐ ఆఫీసర్‌ పాత్రనే సీక్వెల్‌లోనూ నెడుముడి వేణు పోషించనున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అనిరుధ్ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు.

1588
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles