పుల్లెల గోపీచంద్ పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు

Mon,December 10, 2018 05:52 PM
Sonusood plays as Pullela gopichand in pv Sindhu biopic

బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ సింధు బ‌యోపిక్ ప‌ట్టాలెక్క‌నున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ న‌టుడు సోనూ సూద్ ఈ బయోపిక్ ను నిర్మిస్తున్నాడు. అయితే పీవీ సింధు పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తున్నారు. ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నే విషయంపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన వార్త ఒక‌టి ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ చిత్రంలో సోనూసూద్ లెజెండ‌రీ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్, కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్ర‌లో న‌టించ‌నున్నాడు. సోనూసూద్ఈ విష‌యాన్ని తాజాగా ఓ ఇంట‌ర్య్వూలో వెల్ల‌డించాడు. పీవీ సింధు అంత‌ర్జాతీయ స్థాయిలో సాధించిన ఘ‌న‌ విజ‌యాల వెనుక గోపీచంద్ ఉన్నార‌నే విష‌యం తెలిసిందే. వ‌చ్చే ఏడాది సింధు బ‌యోపిక్ సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

2734
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles