మ‌ణికర్ణిక‌లో సోనూ సూద్ గెటప్ అదుర్స్

Wed,April 11, 2018 11:39 AM
SONU SOOD METAMORPHOSES INTO A MARATHA WARRIOR

కొంద‌రు న‌టీన‌టులు ఏ పాత్ర‌ల‌లోనైన ఇట్టే ఒదిగిపోతారు. అలాంటి వారిలో సోనూ సూద్ ఒక‌రు. అరుంధ‌తి చిత్రంలో ప‌శుప‌తిగా ఆయ‌న న‌ట‌న అనిర్వ‌చ‌నీయం. ప్ర‌తినాయ‌కుడిగానే ఎక్కువ పాపుల‌ర్ అయిన సోనూ మ‌ణికర్ణిక చిత్రంలో మ‌రాఠీ రాజు పాత్ర పోషిస్తున్న‌ట్టు స‌మాచారం. రాజు పాత్ర‌కి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. సోనూ సూద్ చూసిన అభిమానులు ఆయ‌న‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మ‌ణిక‌ర్ణిక చిత్రం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా ఆగ‌స్ట్‌లో రిలీజ్ కానుంది. ఝాన్సీ ల‌క్ష్మీ బాయ్ జీవిత నేప‌థ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ప్ర‌స్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. విజ‌యేంద్ర ప్ర‌సాద్ చిత్రానికి క‌థ అందించారు.

1727
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles