డాక్ట‌రేట్ అందుకున్న అనుష్క విల‌న్‌

Wed,September 26, 2018 12:28 PM
Sonu Sood honoured with Doctorate Degree

అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన అరుంధ‌తి చిత్రంలో విల‌న్‌గా న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందిన న‌టుడు సోనూ సూద్‌. హిందీలోను ప‌లు చిత్రాలు చేసిన సోనూ ప్ర‌స్తుతం సైనా బ‌యోపిక్‌లో న‌టిస్తున్నాడు. సింధు కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సోనూ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. అయితే 45 ఏళ్ల ఈ న‌టుడికి తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియా‌ సెక్రటరీ జనరల్‌ ప్రభాత్‌ శర్మ తైక్వాండో డాక్టరేట్‌ను అందించారు. ఢిల్లీలో జ‌రిగిన 107వ అంత‌ర్జాతీయ క్యోరుగి రెఫ‌రీ సెమినార్‌లో సోనూ ఈ అవార్డు అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ.. డాక్ట‌రేట్ అందుకోవ‌డం గ‌ర్వంగా ఉంది. తైక్వాండోలో డాక్ట‌ర్ వ‌స్తుంద‌ని ఊహించ‌లేదు. యాక్ష‌న్ సినిమాల‌కి ప్రాధాన్య‌త ఇస్తూ వ‌చ్చిన నాకు మా అమ్మ‌ తైక్వాండో దుస్తులు కొనిచ్చి శిక్షణా తరగతులకు తీసుకెళ్లిన రోజులు గుర్తున్నాయి. ఈ రోజు అమ్మ ఉండుంటే ఎంతో గ‌ర్వించేది. అమ్మ ఆశీర్వాదం వ‌ల‌న‌నే నాకు డాక్ట‌రేట్ వ‌చ్చింద‌ని అనిపిస్తుంది. ఇటువంటి మంచి ఫిట్నెస్ కార్యక్రమాలు ప్రజలు ప్రేరేపిస్తాయి మరియు ఒక ఆరోగ్యకరమైన దేశంగా మారేందుకు దోహ‌దం చేస్తాయి అని సోనూ సూద్ తెలిపారు.

1841
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles