ఒకే వైదిక‌పై బిగ్ బాస్ సీజ‌న్ 1 కంటెస్టెంట్స్

Wed,September 19, 2018 10:16 AM
song teaser launch by season 1 contestants

గ‌త ఏడాది ఎన్టీఆర్ హోస్ట్‌గా సాగిన బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ఎంత హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 70 రోజులు 16 మంది కంటెస్టెంట్స్ ఒక్క హౌజ్‌లో చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. సీజ‌న్ 1లో ఇంటి స‌భ్యులుగా శివ‌బాలాజీ,సంపూర్ణేష్‌, స‌మీర్, ప్రిన్స్, ముమైత్‌, క‌త్తి మ‌హేష్‌, మ‌ధుప్రియ‌, క‌త్తి కార్తీక‌, క‌ల్ప‌న‌, జ్యోతి, హ‌రితేజ‌, దీక్షాపంత్‌, ధ‌న‌రాజ్‌, అర్చ‌న‌, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ , న‌వ‌దీప్‌లు ఉన్నారు. బిగ్ బాస్ హౌజ్ నుండి వీడిన త‌ర్వాత అంద‌రు క‌లిసి ఒక్క స్టేజీపై క‌నిపించిన సంద‌ర్భాలు లేవు. కాని ఈ నెల 21 (శుక్ర‌వారం) ప్ర‌సాద్ ల్యాబ్స్ లో జ‌ర‌గ‌నున్న కార్య‌క్ర‌మంలో వీరంద‌రు ఒకే స్టేజీపై క‌నిపించి సంద‌డి చేయ‌నున్నారు.

హృదయ కాలేయం చిత్రంలో తన కామెడీతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వంలో కొబ్బ‌రి మ‌ట్ట అనే చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రంలో పెదరాయుడు, ఆండ్రాయుడ్, పాపారాయిడు ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించి సందడి చేయనున్నాడు సంపూ. ముగ్గురు భార్యలున్న .. ఒక మనసున్న భర్త కథ కొబ్బ‌రి మ‌ట్ట చిత్రం అని చిత్ర యూనిట్ తెలియ‌జేయ‌గా, ఈ చిత్రం సాంగ్ టీజ‌ర్ కార్య‌క్ర‌మం ఈ శుక్రవారం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేతుల మీదుగా విడుద‌ల కానుంది. ఈ కార్య‌క్ర‌మంలో కంటెస్టెంట్స్ సంద‌డితో పాటు కొబ్బ‌రిమ‌ట్ట సాంగ్ టీజ‌ర్ ప్రేక్ష‌కులని ఎంత‌గానో అల‌రించనుంది

2476
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS