త‌న పెళ్ళిపై క్లారిటీ ఇచ్చిన సోన‌మ్ క‌పూర్‌

Wed,April 25, 2018 11:30 AM
Sonam Kapoor on wedding plans out

అనీల్ క‌పూర్ గారాల పట్టి సోన‌మ్ క‌పూర్ త్వరలో ఇంటి ఇల్లాలు కాబోతుంద‌ని బాలీవుడ్‌లో ఓ రూమ‌ర్ కొద్ది రోజులుగా చ‌క్క‌ర్లు కొడుతున్న సంగ‌తి తెలిసిందే. ఆనంద్ ఆహుజా అనే యువ‌కుడితో కొంత‌కాలం నుండి ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న సోన‌మ్‌, మే 11 లేదా 12న జెనీవా వేదికగా పెళ్లి చేసుకోనుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. సోన‌మ్ తండ్రి అనీల్ క‌పూర్ ప‌ర్స‌న‌ల్‌గా ఫోన్ చేసి అతిధుల‌ని ఆహ్వానించార‌ని, వారికి ఫ్లైట్ టిక్కెట్స్ కూడా బుక్ చేశార‌ని అన్నారు. దీనిపై సోన‌మ్ క‌పూర్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. నా పెళ్లి కోసం ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయ‌ద‌లుచుకోలేదు. అంత అవ‌స‌రం కూడా లేద‌నుకుంటాను. డ‌బ్బు బాగా ఖ‌ర్చు పెట్టి పెళ్లి చేసుకోవ‌డం నాకు ఇష్టం లేదు. అంత‌గా కావాల‌నుకుంటే ఆ డ‌బ్బునే విరాళంగా ఇస్తాను. నాకు న‌చ్చిన‌ట్టు ఇంటి ద‌గ్గ‌రే త‌క్కువ ఖ‌ర్చుతో చేసుకుంటాను. సంప్ర‌దాయాల‌ని గౌరవిస్తాను అని తెలిపింది సోన‌మ్‌. మ‌రి కొద్ది రోజుల‌లో జ‌ర‌గ‌నున్న పెళ్లికి ముందు ఉండే సంగీత్, మెహందీ సెర్మ‌నీల కోసం ఫ‌రా ఖాన్ నేతృత్వంలో క‌పూర్ ఫ్యామిలీ మొత్తం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం వీరి పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని టాక్. సోనమ్ ప్ర‌స్తుతం వీరే ది వెడ్డింగ్‌, సంజూ చిత్రాలతో బిజీగా ఉంది. సంజ‌య్ ద‌త్ బ‌యోపిక్‌(సంజూ)లో గెస్ట్ అప్పీయ‌రెన్స్ ఇస్తుంది సోన‌మ్.

2454
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS