పేరు మార్చుకున్న సోన‌మ్‌.. షాకైన నెటిజన్స్‌

Sat,February 16, 2019 11:59 AM
Sonam Kapoor Has Changed Her Name in social media

బాలీవుడ్ భామ సోన‌మ్ క‌పూర్ గ‌త ఏడాది ఆనంద్ ఆహుజాని వివాహం చేసుకున్న త‌ర్వాత సోష‌ల్ మీడియాలో త‌న పేరుని సోన‌మ్ కె ఆహుజా అని మార్చుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం త‌న ట్విట్ట‌ర్‌లో జోయా సింగ్ సోలంకి అనే పేరు ఉండ‌డంతో నెటిజ‌న్స్ షాక్ అయ్యారు. ఉన్నట్టుండి సోన‌మ్ త‌న పేరుని ఎందుకు మార్చిందో తెలియ‌క అభిమానులు క‌న్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే అసలు విష‌య‌మేమంటే సోన‌మ్ న‌టిస్తున్న తాజా చిత్రం ది జోయా ఫ్యాక్ట‌ర్‌. ఇందులో జోయా అనే పాత్ర‌లో సోన‌మ్ క‌నిపించ‌నుంది. సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా సోన‌మ్ క‌పూర్ త‌న పేరుని సోష‌ల్ మీడియాలో జోయా సింగ్ సోలంకి అని మార్చింది. వ‌ర్క్ విష‌యంలో సోన‌మ్‌కి ఉన్న నిబ‌ద్ద‌త‌ని చూసి అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ది జోయా ఫ్యాక్ట‌ర్ అనే చిత్రంలో దుల్క‌ర్ స‌ల్మాన్ క‌థానాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు. అభిషేక్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుద‌ల కానుంది.

2469
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles