త‌ల్లి కోసం పూజలు చేసిన సోనాలి త‌న‌యుడు

Fri,September 14, 2018 10:54 AM
Sonali Bendres Son Celebrates Ganesh Chaturthi

ఒక‌ప్ప‌టి అందాల తార సోనాలి బింద్రే హైగ్రేడ్ మెటా స్టేటిక్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం త్వ‌ర‌గా మెరుగుప‌డాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. అయితే త‌న త‌ల్లి క్యాన్స‌ర్‌ని జ‌యించి త‌మ‌తో క‌లిసి ఆనంద‌క్ష‌ణాలు గ‌డ‌పాల‌ని సోనాలి త‌న‌యుడు ర‌ణ‌వీర్ కోరుకుంటున్నాడు. నిన్న వినాయ‌క చవితి సంద‌ర్భంగా గ‌ణేషునికి పూజలు చేశాడు. ర‌ణ‌వీర్ ..గ‌ణేషునికి పూజలు చేస్తున్న ఫోటోని షేర్ చేస్తూ.. గ‌ణేష్ చ‌తుర్ధి నా హృద‌యానికి ఎంతో ద‌గ్గ‌రైన పండుగ‌. సెల‌బ్రేష‌న్స్ లో పాల్గొన‌లేక‌పోతున్నందుకు బాధ‌గా ఉంది. అయిన‌ప్ప‌టికి దేవుడి ఆశీస్సులు నాకు తోడుగా ఉంటాయి. ప్ర‌తి ఒక్క‌రు ప్రేమ‌, సంతోషాల‌తో పండుగ జ‌రుపుకోవాల‌ని కోరుకుంటున్నాను అని సోనాలి త‌న పోస్ట్‌లో తెలిపింది. ఇటీవ‌ల బీజేపీ లీడ‌ర్ రామ్ క‌ద‌మ్ సోనాలికి నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై సోనాలి భ‌ర్త గోల్డీ బెహెల్ మండిప‌డ్డారు. నా భార్య గురించి వ‌స్తున్న వదంతులు అస్స‌లు న‌మ్మోద్దు, వాటిని స్ప్రెడ్ చేయోద్దు. దీని వ‌ల్ల కొంద‌రి మ‌నోభావాలు దెబ్బ‌తింటాయ‌నే విష‌యం మ‌రువ‌ద్దు అని గోల్డీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

2889
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS