తొలిసారి నిన్ను మిస్ అవుతున్నాను : సోనాలి

Sun,August 12, 2018 08:01 AM
Sonali Bendre wishes son Ranveer on his birthday

హైగ్రేడ్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న సోనాలి బింద్రే ప్ర‌స్తుతం న్యూయార్క్‌లో క్యాన్స‌ర్ చికిత్స చేయించుకుంటున్న సంగ‌తి తెలిసిందే. సోనాలి ఆరోగ్యంపై అభిమానులు ఆందోళ‌న చెందుతుండ‌గా, ఎప్పటిక‌ప్పుడు సోనాలి కుటుంబ సభ్యులు ఆరోగ్య ప‌రిస్థితిపై సోష‌ల్ మీడియా ద్వారా వివ‌ర‌ణ ఇస్తున్నారు. అప్పుడ‌ప్పుడు సోనాలి కూడా త‌న ట్వీట్ ద్వారా గుండెలోని బాధ‌లని అభిమానుల‌తో షేర్ చేసుకుంటుంది. త‌న‌కి క్యాన్స‌ర్ సోకింద‌నే విష‌యాన్ని ర‌ణ్‌వీర్‌కి చెప్పేందుకు తాను ఎంత స‌త‌మ‌య్యింతో వివ‌రించిన సోనాలి, తొలిసారి త‌న కొడుకు ర‌ణ్‌వీర్‌కి దూరంగా ఉన్నందుకు బ‌రువెక్కిన గుండెతో భావోద్వేగ‌పు ట్వీట్ చేసింది.

ఆగ‌స్ట్ 11వ తారీఖుతో సోనాలి త‌న‌యుడు ర‌ణ్‌వీర్ 13వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్టాడు. ఎప్పుడు త‌న కొడుకు బ‌ర్త్‌డేని గ్రాండ్‌గా జరిపే సోనాలి ఈ బ‌ర్త్‌డేకి త‌న ప‌క్క‌న లేక‌పోయే స‌రికి భావోద్వేగానికి గురై ట్వీట్ చేసింది. ఓ వీడియోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ త‌న బాధ‌ని పంచుకుంది . ర‌ణ్ వీర్ ! నువ్వే నా సూర్యుడు, నా చంద్రుడు , నా న‌క్ష‌త్రం, నా ఆకాశం. ఒక ర‌కంగా నా జీవిత‌మే నువ్వు. నేను భావోద్వేగానికి గుర‌వుతున్నాను , కానీ ఇది నీ 13వ పుట్టిన రోజు. ఇప్పుడు నువ్వు టీనేజ‌ర్‌వి అయ్యావు. ఈ నిజం న‌మ్మాలంటే నాకు కొంత స‌మ‌యం ప‌ట్టొచ్చు. నిన్ను చూసి నేను ఎంత గ‌ర్విస్తున్నానో మాట‌ల‌లో చెప్ప‌లేను. నీ హ‌స్య‌చ‌తుర‌త‌,నీ బ‌లం, ద‌యాగ‌ణం, మాన‌వ‌త్వం అన్నింటిలోన నువ్వు ప‌ర్‌ఫెక్ట్. నీకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. తొలిసారి నేను లేకుండా బ‌ర్త్ డే జ‌రుపుకుంటున్నావు. నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నీ పైన ప్రేమ ఎప్ప‌టికి ఉంటుంది అంటూ త‌న భావోద్వేగాన్ని పోస్ట్ ద్వారా తెలిపింది సోనాలి.

5409
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles