సోనాలిని క‌లిసి ధైర్యం అందించిన‌ మ‌హేష్ స‌తీమ‌ణి

Wed,October 31, 2018 12:26 PM
Sonali Bendre is a strong girl says namrata

ఒక‌ప్ప‌టి అందాల తార సోనాలి బింద్రే హైగ్రేడ్ మెటా స్టేటిక్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతుండ‌గా, ప్ర‌స్తుతం న్యూయార్క్‌లో చికిత్స పొందుతుంది. అప్పుడప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా త‌న క్షేమ స‌మాచారాన్ని ప్ర‌జ‌ల‌కు చేర‌వేస్తుంది. అయితే మహ‌ర్షి మూవీ షూటింగ్ నిమిత్తం న్యూయార్క్ వెళ్ళిన మ‌హేష్ ఫ్యామిలీ సోనాలి బింద్రేని క‌లిసి ఆమెకి ధైర్యాన్ని అందించిన‌ట్టు తెలుస్తుంది. ఓ ఆంగ్ల మీడియాకి ఇంట‌ర్వ్యూ ఇచ్చిన న‌మ్ర‌త‌.. సోనాలి గురించి మాట్లాడుతూ ఆమె చాలా శ‌క్తివంత‌మైన మ‌హిళ అని చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న‌సోనాలి త్వ‌ర‌లోనే మాములు జీవితం గ‌డ‌ప‌నున్నారు. ఆమెతో స‌ర‌దా స‌మ‌యం గడిపాను. అనారోగ్యానికి సంబంధించిన అన్ని విష‌యాలు చ‌ర్చించాం. సోనాలి ఆరోగ్యం త్వ‌ర‌గా కుదుట‌ప‌డాల‌ని ఎల్ల‌ప్పుడు దేవుడిని ప్రార్ధిస్తూనే ఉంటాను అని మాట ఇచ్చాను. మేమిద్ద‌రం క‌లిసి సెంట్ర‌ల్ పార్క్‌లో వాకింగ్ చేయాల‌ని అనుకున్నాం. కాని ప‌ని వ‌ల‌న కుద‌ర‌లేదు. త్వ‌ర‌లో మ‌రోసారి సోనాలిని క‌లిసి ఇచ్చిన మాట‌ని నెర‌వేర్చుకుంటాను అని న‌మ్ర‌త స్ప‌ష్టం చేశారు. ప‌లు తెలుగు సినిమాల‌లో న‌టించిన సోనాలి బింద్రే మ‌హేష్ స‌ర‌స‌న మురారి చిత్రంలో న‌టించిన విష‌యం విదిత‌మే.

3397
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles