మ‌నోభావాలు దెబ్బ‌తీయోద్దు: సోనాలి భ‌ర్త‌

Sun,September 9, 2018 12:56 PM
Sonali Bendre  husband Goldie Behl urges people

ప్ర‌ముఖ న‌టి సోనాలి బింద్రే హైగ్రేడ్ మెటా స్టేటిక్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతూ న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఆమెకి క్యాన్స‌ర్ సోకింద‌నే వార్త‌ని ఇప్ప‌టికి అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. అయితే సోనాలి ఆరోగ్య ప‌రిస్థితికి సంబంధించి ఆమె భ‌ర్త గోల్డీ బెహెల్ ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కి చేర‌వేస్తున్నాడు. అయితే రీసెంట్‌గా రామ్ క‌ద‌మ్ అనే బీజేపీ లీడ‌ర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌ముఖ న‌టి సోనాలి బింద్రే అమెరికాలో చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్టు ట్వీట్ చేశారు. ఆమె మృతికి సంతాపం కూడా ప్ర‌క‌టించారు. అయితే ఓ నెటిజ‌న్ అది ఫేక్ అని చెప్ప‌డంతో వెంటనే పాత ట్వీట్ డిలీట్ చేసి మ‌రో ట్వీట్ చేశారు. రెండు రోజులుగా సోనాలి లేరు అని వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వం. ఆమె ఆరోగ్యంగా ఉండాల‌ని, హైగ్రేడ్ క్యాన్స‌ర్ నుండి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ భ‌గ‌వంతుడిని ప్రార్ధిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు రామ్ క‌దాం. ఈ విష‌యంపై సోనాలి భ‌ర్త గోల్డీ బెహెల్ తాజాగా ట్వీట్ చేశారు. సోష‌ల్ మీడియాని మ‌రింత బాధ్యతాయుతంగా వాడాలని దయచేసి నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. నా భార్య గురించి వ‌స్తున్న వదంతులు అస్స‌లు న‌మ్మోద్దు, వాటిని స్ప్రెడ్ చేయోద్దు. దీని వ‌ల్ల కొంద‌రి మ‌నోభావాలు దెబ్బ‌తింటాయ‌నే విష‌యం మ‌రువ‌ద్దు అని గోల్డీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.


3285
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS