దీపామాలిక్ బయోపిక్ లో సోనాక్షిసిన్హా..?

Wed,June 19, 2019 06:57 PM
Sonakshi Sinha to play lead in Deepa Malik biopic?


ఈ ఏడాది కళంక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది బాలీవుడ్ నటి సోనాక్షిసిన్హా. మల్లీస్టారర్ గా విడుదలైన చిత్రం బాక్సాపీస్ వద్ద ఆశించినంత విజయాన్ని సాధించలేకపోయింది. అయితే దీని తర్వాత సోనాక్షిసిన్హా చేయబోతున్న కొత్త చిత్రం గురించి వార్త ఒకటి బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. పారాలింపిక్ రజత పతక విజేత దీపామాలిక్ బయోపిక్ లో సోనాక్షి నటించనున్నట్లు ముంబై మిర్రర్ ఓ కథనంలో వెల్లడించింది.

2016లో ఓ అవార్డు షో కార్యక్రమంలో సోనాక్షిసిన్హా పారాలింపిక్ చాంపియన్ దీపామాలిక్ ను కలుసుకుంది. తాను ఎంతగానో అభిమానించే దీపామాలిక్ ను కలుసుకున్న సంతోషాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది సోనాక్షి. పాజిటివ్ ఎనర్జీతో ఎందరికో స్పూర్తివంతంగా నిలుస్తున్న మీకు ధన్యవాదాలు. మిమ్మల్ని కలవడం అభిమానిగా చాలా గొప్ప అనుభూతి అని ట్వీట్ చేసింది సోనాక్షి.

906
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles