హెడ్‌ఫోన్స్ ఆర్డర్ చేస్తే ఈ హీరోయిన్‌కు ఏం వచ్చాయో చూడండి!

Thu,December 13, 2018 03:21 PM
Sonakshi Sinha orders Headphones gets junk instead

ఆన్‌లైన్ షాపింగ్ మోసాలు ఈ మధ్య సర్వసాధారణమైపోయాయి. ఫోన్ ఆర్డర్ చేస్తే సబ్బులు, ఇటుకలు రావడం మనం చూశాం. ఇలాంటి చేదు అనుభవమే బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాకు ఎదురైంది. ఆమె ఎంతో ముచ్చటగా హెడ్‌ఫోన్స్ ఆర్డర్ చేస్తే.. ఏదో చెత్త నట్లు, బోల్టులు వచ్చాయి. అవి మామూలు హెడ్‌ఫోన్స్ కాదు. రూ.18 వేల విలువైన బోస్ హెడ్‌ఫోన్స్. పైకి మాత్రం పక్కాగా బోస్ హెడ్‌ఫోన్స్ ప్యాకింగ్ ఉంది. తెరచి చూస్తే ఈ చెత్త కనిపించింది అంటూ సోనాక్షి ట్వీట్ చేసింది.


ఇదే విషయాన్ని కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి చెప్పినా వాళ్లు పట్టించుకోలేదని ఆమె మరో ట్వీట్ చేసింది.
అయితే జరిగిన తప్పిదానికి క్షమాపణ చెబుతూ అమెజాన్ ట్వీట్ చేసింది. జరిగిన పొరపాటును సరి చేస్తామని సోనాక్షికి హామీ ఇచ్చింది.

5225
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles