గుళ్ళోకి వెళ్లొచ్చే స‌రికి న‌టి చెప్పులు మాయం..!

Thu,September 12, 2019 01:41 PM
Someone steals Swara Bhasker sandals

కొంద‌రు దైవ ద‌ర్శ‌నార్ధం ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రానికి వెళ్లి , అక్క‌డ చెప్పుల‌ని స్టాండ్‌లో కాకుండా ప‌క్క‌న వ‌దిలేస్తుంటారు. ద‌ర్శ‌నం పూర్తైన త‌ర్వాత వ‌చ్చి చూసే స‌రికి అవి మాయం అవ్వ‌డం సాధార‌ణంగా జ‌రుగుతూ ఉంటుంది. తాజాగా ఇలాంటి సంఘ‌ట‌న ప్ర‌ముఖ న‌టి స్వ‌ర భాస్క‌ర్ విష‌యంలోను జ‌రిగింది. ఈ విష‌యాన్ని స్వ‌ర భాస్క‌ర్ త‌న ట్విట్ట‌ర్‌లో వీడియో ద్వారా తెల‌ప‌డం విశేషం. గ‌ణేష్ చతుర్ధి సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా స్వ‌ర భాస్క‌ర్ రీసెంట్‌గా ముంబైలోని లాల్‌బాగ్చారాజా దర్శనానికి వచ్చారు. ఆమె గణేశుని దర్శనం చేసుకుని తిరిగి వచ్చి చూస్తే, తాను వేసుకొచ్చిన కోల్హాపూర్ చెప్పులు మాయ‌మ‌య్యాయి. దీంతో చెప్పులు లేకుండానే కారు వ‌ర‌కు న‌డుచుకుంటూ వెళ్ళింది. ఈ విష‌యాన్ని స్వ‌ర భాస్క‌ర్ సోష‌ల్ మీడియాలో వీడియో ద్వారా వివ‌రించింది. ఈ వీడియోపై నెటిజ‌న్స్ చాలా ఫన్నీగా స్పందిస్తున్నారు. ప్ర‌స్తుతం స్వ‌ర భాస్క‌ర్ .. ఫ‌రాజ్ ఆరిఫ్ అన్సారీ రూపొందిస్తున్న షీర్ కుర్మా చిత్రంతో బిజీగా ఉంది. ఇందులో స్వ‌ర భాస్క‌ర్‌తో పాటు ష‌బానా అజ్మీ, దివ్య ద‌త్తా ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.





3028
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles