సోగ్గాడి సీక్వెల్‌లో నాగ్ స‌ర‌స‌న ర‌మ్యకృష్ణ..!

Sun,December 16, 2018 08:17 AM
Soggade Chinni Nayana sequel story to be ready

2016 సంక్రాంతి కానుక‌గా విడుద‌లై ప్రేక్షకుల ఆద‌ర‌ణ పొందిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నా. నాగ్ డబుల్ షేడ్స్‌లో నటించి మెప్పించిన ఈ చిత్రం ఆయ‌న‌ కెరియర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించింది. బంగార్రాజు అనే పాత్ర‌లో నాగ్ త‌న న‌ట‌నతో ఆక‌ట్టుకున్నాడు. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి లు హీరోయిన్‌లుగా నటించగా, ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించే ఏర్పాట్లు జరుగుతున్నట్టు గ‌తంలోనే వార్త‌లు వ‌చ్చాయి. సీక్వెల్‌కు బంగార్రాజు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నామ‌ని అన్నారు.

సీక్వెల్‌కి సంబంధించి క‌ళ్యాణ్ కృష్ణ కొద్ది రోజులుగా స్క్రిప్ట్ వ‌ర్క్ చేస్తుండ‌గా, ఇటీవ‌ల క‌థ‌ని నాగ్‌కి వినిపించార‌ట‌. అయితే ఆ క‌థ‌లో కొన్ని మార్పులు చేసి స్టోరీని ఓ కొలిక్కి తెచ్చార‌ని అంటున్నారు. క‌థ మొత్తం బంగార్రాజు చుట్టూనే తిర‌గ‌నుండ‌గా, ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంద‌ట‌. ఇక నాగ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా ర‌మ్య‌కృష్ణ‌ని ఎంపిక చేశార‌ని అంటున్నారు. చైతూ కూడా చిత్రంలో న‌టించ‌నున్నాడ‌ని స‌మాచారం. ఆయ‌న‌కి జోడీగా ఎవరిని ఎంపిక చేయాలా అని చిత్ర‌బృందం క‌స‌ర‌త్తులు చేస్తుంద‌ట‌. త్వ‌ర‌లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. నాగ్ చివ‌రిగా దేవ‌దాస్ అనే మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

2319
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles