స్నేహ సెల్ఫీ విత్ బ‌న్నీ

Tue,August 21, 2018 01:06 PM
sneha shares selfie with her family

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంద‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అన్యోన్య‌మైన జంట‌ల‌లో ఒక‌రిగా ఉన్న బ‌న్నీ, స్నేహ‌ల‌ని చూసి అభిమానులు తెగ మురిసిపోతుంటారు. అయితే అప్పుడ‌ప్పుడు వీరిద్ద‌రు క‌లిసి త‌మ పిల్ల‌ల‌తో దిగే ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంటాయి. తాజాగా స్నేహారెడ్డి త‌న కూతురు అర్హాని ఎత్తుకొని సెల్ఫీ దిగింది. ఈ సెల్ఫీలో బ‌న్నీ, అయాన్ కూడా క‌నిపిస్తున్నారు. స్నేహ పోస్ట్ చేసిన ఫోటోకి కొద్ది గంట‌ల‌లోనే 1.2 ల‌క్ష‌ల లైక్స్ రావ‌డం విశేషం. ఆ మ‌ధ్య బన్నీ స‌తీమ‌ణి స్నేహ తన ఇద్దరు పిల్లలు అయాన్, అర్హలతో ఉన్న పిక్‌తో పాటు సింగిల్ ఫోటోని షేర్ చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న భార్య సోలో ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ఓ మై గాడ్ ! నేను న‌మ్మ‌లేక‌పోతున్నాను. ఇంత అంద‌మైన అమ్మాయిని వివాహం చేసుకున్నానా అంటూ బ‌న్నీ కామెంట్ పెట్టాడు. నా పేరు సూర్య‌.. నా ఇల్లు ఇండియా బ‌న్నీ చివ‌రి చిత్రం కాగా, ఆయ‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ ఎవ‌రితో ఉంటుంద‌నే దానిపై అభిమానుల‌లో స‌స్పెన్స్ నెల‌కొంది. విక్ర‌మ్ కుమార్, ప‌ర‌శురాంల‌లో ఒక‌రితో బ‌న్నీ సినిమా చేయ‌నున్నాడు అని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

3634
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS