ఎన్టీఆర్, మహేష్‌ ఎఫెక్ట్ తో క్యూ క‌ట్టిన‌ చిన్న సినిమాలు

Thu,September 14, 2017 02:01 PM
SMALL MOVIES BIG FIGHT ON TOMORROW

దసరా బరిలో జూనియర్ ఎన్టీఆర్ , మహేష్ బాబు పోటికి సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ జై లవకుశతో సెప్టెంబర్ 21న సందడి చేస్తే, మహేష్‌ బాబు స్పైడర్ సినిమాతో సెప్టెంబర్ 27న పసందైన విందు అందించాలని భావిస్తున్నాడు. వారం గ్యాప్ లో విడుదల కానున్న ఈ రెండు సినిమాలపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మిగతా చిత్ర నిర్మాతలు సెప్టెంబర్ 21 కి ముందు రోజులలో తమ సినిమాలని రిలీజ్ చేసి అదృష్టం పరీక్షించుకోవాలని భావిస్తున్నారు.

ఈ నెలలో ముందుగా పైసా వసూల్ దండ యాత్ర చేస్తే ఆ తర్వాత యుద్ధం శరణం, మేడ మీద అబ్బాయి చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ వారం అంటే సెప్టెంబర్ 15న దాదాపు 6 సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. అందులో నారా రోహిత్ ‘కథలో రాజకుమారి’, సందీప్ కిషన్ ‘ప్రాజెక్ట్ జెడ్’, సునీల్ ‘ఉంగరాల రాంబాబు’, సచిన్ జోషి ‘వీడెవడు’, విజయేంద్ర ప్రసాద్ డైరెక్ట్ చేసిన ‘శ్రీవల్లి’ చెప్పుకోదగిన సినిమాలు కాగా శింబు, నయనతారల డబ్బింగ్ చిత్రం ‘సరసుడు’ కూడా అదే రోజు రిలీజ్ కానుంది. ఇక శర్వానంద్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మహానుభావుడు చిత్రం స్పైడర్ రిలీజైన రెండు రోజులకి అంటే సెప్టెంబర్ 29న రిలీజ్ కానుంది. అంటే మొత్తం మీద సెప్టెంబర్ నెలలో 12 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.

1602
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS