ఈ చిన్నారి డ్యాన్స్‌కి ఫిదా కాని వారుండ‌రు

Wed,July 18, 2018 11:50 AM

సోష‌ల్ మీడియా వ‌ల‌న కొంద‌రు రాత్రికి రాత్రే సెల‌బ్రిటీలు అవుతున్నార‌నే విష‌యం గుర్తించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇందుకు చాలా ఉదాహ‌ర‌ణ‌లు కూడా ఉన్నాయి. దేశం న‌లుమూల‌లో ఎక్క‌డ‌ ఉన్న వారి టాలెంట్ సోష‌ల్ మీడియా వ‌ల‌న ప్ర‌పంచానికి తెలుస్తుంది. తాజాగా ఓ చిన్నారి సంజు చిత్రంలోని మొద‌టి సాంగ్‌కి అదిరిపోయే స్టెప్స్ వేసి అంద‌రి మ‌న‌సులు గెలుచుకుంది. ‘మై బడియా తూ భీ బడియా’ పాటకు చిన్నారి వేసిన డ్యాన్స్ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అయింది. స్కూల్ యూనిఫాంలో ఉన్న ఈ పాప మ్యూజిక్‌కి అనుగ‌ణంగా వేసిన స్టెప్పులు ప్ర‌తి ఒక్క‌రిని అల‌రిస్తున్నాయి. సంజూ చిత్రంలోని ‘మై బడియా తూ భీ బడియా’ పాటకు రోహ‌న్ సంగీతం అందించ‌గా సోనూ నిగ‌మ్‌, సునిది చౌహ‌న్ పాట పాడారు. రాజ్ కుమార్ హిరాణి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సంజూ చిత్రంలో రణ్‌బీర్ ప్ర‌ధాన పాత్ర పోషించాడు. ప్ర‌పంచ వ్యాప్తంగా 500 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించిన ఈ చిత్రం పలు బాలీవుడ్ హిట్ చిత్రాల రికార్డుని బ్రేక్ చేసింది. ప‌రేష్ రావ‌ల్‌, మ‌నీషాకోయిరాల, దియా మీర్జా, సోనమ్ కపూర్‌, విక్కీ కౌశల్‌, జిమ్ సర్బ్‌, అనుష్క శర్మలు ముఖ్య పాత్ర‌లు పోషించారు .

3339
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles