నిర‌స‌న తెలిపిన వాల్మీకి కుల‌స్తులు.. షూటింగ్‌కి బ్రేక్!

Thu,July 4, 2019 08:34 AM
small break for Valmiki shooting

హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం వాల్మీకి. కొద్ది రోజుల క్రితం యాగంటిలో షూటింగ్ జ‌రుపుకున్న ఈ చిత్రం రీసెంట్‌గా అనంత‌పురంకి షిఫ్ట్ అయింది. అక్క‌డ కొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రీకరించేందుకు సిద్ద‌మైంది చిత్ర బృందం. అయితే వాల్మీకి కులానికి చెందిన కొంద‌రు వ్య‌క్తులు ఈ సినిమా లొకేష‌న్‌కి వ‌చ్చి నిర‌స‌న తెలిపార‌ట‌. వాల్మీకి’ అనే గొప్ప వ్య‌క్తి పేరును హింసాత్మ‌క సినిమాకు ఎలా వాడుకుంటున్నారంటూ మండిప‌డ్డార‌ట‌. అంతేకాక షూటింగ్ లొకేషన్‌లో ఉన్న వరుణ్ తేజ్, హరీష్ శంకర్‌లను అక్కడ నుండి వెళ్లిపోవల్సిందిగా హెచ్చరించడంతో.. తప్పనిసరి పరిస్థితిలో షూటింగ్‌కి ప్యాకప్ చెప్పేశారట. చేవెళ్ళ‌లో షూటింగ్ జ‌రిపేందుకు చిత్ర బృందం సిద్ద‌మైన‌ట్టు తెలుస్తుంది. ఇటీవ‌ల వాల్మీకి చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా ఇందులో వ‌రుణ్ లుక్ అంద‌రిని ఆక‌ట్టుకుంది. క్రూరమైన లుక్‌తో, గుబురు గడ్డం.. మాసిన జుట్టుతో కళ్లకు కాటుక పెట్టుకుని, ముఖంపై గాట్లుతో క‌రుడు గ‌ట్టిన వ్య‌క్తిలా క‌నిపించాడు వ‌రుణ్ . ఈ లుక్‌‌ మెగా ఫ్యాన్స్‌కి విపరీతంగా న‌చ్చేసింది. వాల్మీకి చిత్రం తమిళంలో సంచలన విజయాన్ని సాధించిన ‘జిగర్తాండ’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతుంది. పూజా హెగ్డే క‌థానాయిక‌గా నటిస్తోంది. సెప్టెంబర్ 6న విడుదల కానున్న ఈ చిత్రానికి మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

2845
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles