క‌మ‌ల్ హాస‌న్‌పై చెప్పుల‌తో దాడి

Thu,May 16, 2019 09:31 AM
Slippers Thrown At Kamal Haasan

న‌టుడి నుండి రాజ‌కీయ నాయ‌కుడిగా మారిన క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌స్తుతం వివాదాల‌తో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు. రీసెంట్‌గా ఆయ‌న ఓ ప్ర‌చారంలో మాట్లాడుతూ.. స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది ఓ హిందూ అని, అతని పేరు నాథూరామ్ గాడ్సే అని అన్నారు. దీంతో క‌మ‌ల్‌పై స‌ర్వ‌త్రా నిర‌స‌న‌లు మొద‌ల‌య్యాయి. ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లు సంఘాలు డిమాండ్ చేశాయి. బీజేపీ శ్రేణులు కూడా క‌మ‌ల్ వ్యాఖ్య‌ల‌ని త‌ప్పు ప‌ట్టారు. అయితే బుధ‌వారం రోజు క‌మ‌ల్ మ‌ధురైలోని తిరుప్ప‌ర‌కుంద్రం రోడ్ షోలో పాల్గొన్నారు. ఆయ‌న మాట్లాడుతున్న స‌మ‌యంలో 11 మంది వ్య‌క్తులు క‌మ‌ల్‌పై చెప్పులు వేసిన‌ట్టు పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచార‌ణ జ‌రుపుతున్నారు. మ‌క్క‌ల్ నీది మయ్య‌మ్ అధ్య‌క్షుడు క‌మ‌ల్ హాస‌న్ లోక్ స‌భ ఎన్నిక‌ల‌కి దూరంగా ఉండ‌గా, అసెంబ్లీ ఎన్నిక‌ల‌కి సిద్ధ‌మ‌వుతున్నాడు.

2720
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles