బాలీవుడ్‌కి వెళ్ళ‌నున్న మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం

Fri,February 22, 2019 07:50 AM
sivaputrudu movie remakes in bollywood

త‌మిళ స్టార్ హీరోలు సూర్య‌, విక్ర‌మ్ క‌లిసి న‌టించిన చిత్రం పితామ‌గ‌న్‌. 2003లో విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. తెలుగులో ఈ చిత్రాన్ని శివ‌పుత్రుడు పేరుతో విడుద‌ల చేశారు.ఈ చిత్రం ద‌ర్శ‌కుడిగా బాలాకి మంచి పేరు తీసుకు రాగా, విక్ర‌మ్‌కి కూడా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ మూవీని బాలీవుడ్‌లో రీమేక్ చేసే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు స‌మాచారం. స‌తీష్ కౌషిక్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తుంది. స‌తీష్ గ‌తంలో బాలా తెర‌కెక్కించిన సేతు సినిమాని బాలీవుడ్‌లో తేరే నామ్ పేరుతో రీమేక్ చేశారు. అతి త్వ‌ర‌లోనే ఈ రీమేక్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన క్లారిటీ రానుంది.

2039
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles