సెల్ నెట్టేసినందుకు క్ష‌మాప‌ణ‌లు తెలిపిన సూర్య తండ్రి

Tue,October 30, 2018 12:56 PM
siva kumar says sorry

మ‌ధురైలోని షోరూం ప్రారంభోత్స‌వానికి ముఖ్య అతిధిగా వెళ్ళిన సూర్య తండ్రి శివ‌కుమార్ రిబ్బ‌న్ క‌ట్ చేసే స‌మ‌యంలో ఓ అభిమాని ఆయ‌న‌తో సెల్ఫీ తీసుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా, శివ‌కుమార్ అత‌ని ఫోన్‌ని నెట్టేసిన సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగా నెటిజ‌న్స్ ప‌లు మీమ్స్‌తో శివ‌కుమార్‌ని ఎండ‌గ‌ట్టారు. దీంతో చేసేదేం లేక ఓ వీడియో ద్వారా క్ష‌మాప‌ణ‌లు తెలియ‌జేశాడు. అంతేకాదు ఆ స‌మ‌యంలో తాను అలా ఎందుకు ప్ర‌వ‌ర్తించాడో కూడా తెలియ‌జేశాడు.

జ్ఞాప‌కాల కోసం సెల్ఫీలు దిగడం త‌ప్పేమి కాదు. కాని సెల‌బ్రిటీల విష‌యంలో వారికి కొంత ప్రైవ‌సీ ఉంటుంది. కారు దిగి న‌డుస్తున్న స‌మ‌యంలో దాదాపు 300 మంది న‌న్ను చుట్టు ముట్టారు. 20 నుండి 25కి పైగా అభిమానులు సెక్యూరిటీని నెట్టుకొని మ‌రీ నా ద‌గ్గ‌ర‌కి వ‌చ్చి సెల్ఫీలు దిగుతున్నారు. ఓ సెల‌బ్రిటీతో సెల్ఫీ దిగాలంటే అనుమ‌తి తీసుకొని దిగ‌డం మంచిది. అంతేకాని ప‌బ్లిక్ ప్రాప‌ర్టిలా మ‌మ్మ‌ల్ని చూడ‌డం న‌చ్చ‌దు. ఎయిర్ పోర్ట్ లేదా ఇత‌ర వేదిక‌ల వ‌ద్ద అభిమానులు సెల్ఫీ అడిగిన‌ప్పుడు నేను ఎప్పుడు నో చెప్ప‌లేదు. నేను ఒక బుద్దుడిలానో లేదంటే సాధువులా కూడా ఫీల్ కావ‌డం లేదు. మీ అందరిలాగా సాధార‌ణ మ‌నిషినే. ఓ నేత‌గానో సూప‌ర్ స్టార్‌లానో కూడా చూడ‌మ‌ని నేను అడ‌గ‌డం లేదు. ప్ర‌తి ఒక్క‌రు వారి జీవితాల్లో వారే హీరోలు. మ‌నం చేసే కొన్ని ప‌నుల వ‌ల‌న ప‌క్క‌న వారు ఎంత ఇబ్బంది ప‌డతారో ఒక్క క్ష‌ణం ఆలోచించాలి అని శివ కుమార్ స్ప‌ష్టం చేశారు.
2974
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles