ఫోన్ కొనిచ్చి వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టిన సూర్య తండ్రి

Fri,November 2, 2018 12:32 PM
siva kumar gifted mobile to his fan

మ‌ధురైలోని షోరూం ప్రారంభోత్స‌వానికి ముఖ్య అతిధిగా వెళ్ళిన సూర్య తండ్రి శివ‌కుమార్ రిబ్బ‌న్ క‌ట్ చేసే స‌మ‌యంలో ఓ అభిమాని ఆయ‌న‌తో సెల్ఫీ తీసుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా, శివ‌కుమార్ అత‌ని ఫోన్‌ని నెట్టేసిన సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగా నెటిజ‌న్స్ ప‌లు మీమ్స్‌తో శివ‌కుమార్‌ని ఎండ‌గ‌ట్టారు. దీంతో చేసేదేం లేక ఓ వీడియో ద్వారా క్ష‌మాప‌ణ‌లు తెలియ‌జేశాడు. అంతేకాదు ఆ స‌మ‌యంలో తాను అలా ఎందుకు ప్ర‌వ‌ర్తించాడో కూడా తెలియ‌జేశాడు. అయితే శివ‌కుమార్ సంజాయిషీ రాహుల్‌కి న‌చ్చ‌లేదు. దీంతో ఆయ‌న బాధ‌ని వీడియో ద్వారా వ్య‌క్తం చేశాడు.

శివ‌కుమార్ వంటి గొప్ప న‌టుడు ఆ స‌మ‌యంలో అలా ప్ర‌వ‌ర్తిస్తార‌ని ఊహించ‌లేదు. ఆయ‌న ప్రవ‌ర్త‌న నాకు న‌చ్చ‌లేదు. ఓ వీడియో ద్వారా క్ష‌మాప‌ణ కోరిన తాను నన్ను వ్య‌క్తిగతంగా క‌లిసి సంజాయిషీ లాంటివి ఏమి చేయ‌లేదు. ఇక నా జీవితంలో ఏ సెల‌బ్రిటీతో సెల్ఫీ దిగ‌ను. దీనిని ఓ గుణ‌పాఠంగా భావిస్తాను అని రాహుల్ అన్నాడు. దీనిపై స్పందించిన శివ‌కుమార్ ఇప్ప‌టికి నేను చేసింది త‌ప్పు అని అనిపిస్తే న‌న్ను క్ష‌మించండి . ఆ స‌మ‌యంలో అలా చేసి ఉండ‌కూడ‌దు అని మ‌రో వీడియో ద్వారా తెలిపాడు. అంతేకాక రాహుల్‌కి రూ.21,000 ఖరీదైన వీవో స్మార్ట్‌ ఫోన్‌ను కొనిచ్చారు శివ‌కుమార్. దీంతో సంతృప్తి చెందిన రాహుల్ ఈ వివాదంకి ముగింపు ప‌లికిన‌ట్టు తెలుస్తుంది.

3384
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles