త‌మిళంలోకి ఎంట్రీ ఇస్తున్న స్టైలిష్ స్టార్ ..!

Thu,August 30, 2018 11:57 AM
Siva Directs allu arjun next movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి తెలుగుతో పాటు మ‌ల‌యాళంలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న మార్కెట్ అంచెలంచ‌లుగా పెరుగుతూ పోతుంది. త‌మిళంలో కూడా అల్లు అర్జున్ క్రేజ్ పెంచుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో గ‌త ఏడాది ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా స్టైలిష్ స్టార్‌తో బైలింగ్యువ‌ల్ మూవీ ప్లాన్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. లింగు సామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని ప్ర‌చారం జ‌రిగింది. కాని ప‌లుకార‌ణాల వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.

త‌మిళంలో వీరం, వేదాళం, వివేగం ,విశ్వాసం సినిమాల ద‌ర్శ‌కుడు శివ త్వ‌ర‌లో బ‌న్నీతో త‌మిళ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడ‌ట. శివ ఈ మ‌ధ్య బ‌న్నీని క‌లిసి క‌థ‌కి సంబంధించి చ‌ర్చ‌లు జ‌రిపిన నేప‌థ్యంలో అల్లు అర్జున్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలుస్తుంది. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నున్న‌ట్టు టాక్. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం త‌ర్వాత బ‌న్నీ త‌న త‌దుపరి ప్రాజెక్ట్‌ని ఇంత వ‌ర‌కు ప్ర‌క‌టించలేదు. బ‌న్నీ త‌దుప‌రి చిత్రం విక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో లేదంటే ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంద‌ని అంటున్నారు. అతి త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది.

2618
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles