కొత్త ద‌ర్శ‌కుడితో నాని..

Fri,June 15, 2018 08:14 AM
Sithara Entertainments joins with nani

వ‌రుస స‌క్సెస్‌ల‌తో జెట్ స్పీడ్‌లా దూసుకుపోయిన నానికి కృష్ణార్జున యుద్ధం బ్రేక్ వేసింది. ఈ సినిమా ఫ్లాప్ కావ‌డంతో నానికి ట్రిపుల్ హ్యాట్రిక్ మిస్ అయింది. అయితే ప్ర‌స్తుతం కింగ్ నాగార్జున‌తో క‌లిసి శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల్టీ స్టార‌ర్ చేస్తున్నాడు నాని. ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. దీంతో పాటు బిగ్ బాస్ 2 రియాలిటీ షో కార్య‌క్ర‌మంలోను పాల్గొంటున్నాడు. అభిమానులు అంద‌రు నాని త‌దుప‌రి ప్రాజెక్ట్ ఏంటా అని ఆలోచ‌న‌లో ప‌డ‌గా, కొద్ది సేప‌టిక్రితం ఎనౌన్స్‌మెంట్ వ‌చ్చింది.

ప్ర‌ముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్‌లో నాని త‌న తదుప‌రి చిత్రం చేయ‌నున్నాడు. మ‌ళ్ళీ రావాఫేం గౌత‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొంద‌నుండ‌గా మూవీ టైటిల్, లోగో మ‌రియు న‌టీన‌టుల వివ‌రాలు మ‌రి కొద్ది నిమిషాల‌లో ప్ర‌క‌టించ‌నున్నారు. ప్ర‌స్తుతం సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో చైతూ మూవీ రూపొందుతుంది. ఈ చిత్రాన్ని మారుతి తెర‌కెక్కిస్తున్నాడు. శ‌ర్వానంద్‌- సుధీర్ వర్మ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రాన్ని కూడా ఇదే సంస్థ నిర్మిస్తుంది. మొత్తానికి మూడు ఢిఫ‌రెంట్ సినిమాల‌ని నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రేక్ష‌కుల‌కి ఎలాంటి వినోదం అందిస్తుందో చూడాలి.

1909
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles