బాహుబ‌లి పాట‌కి సితార స్టెప్పులు.. మ‌హేష్ ఫిదా

Wed,March 20, 2019 08:23 AM
sitara dance for baahubali song

సూప‌ర్ స్టార్ కృష్ణ‌ న‌టవార‌సార‌త్వాన్ని పుణికి పుచ్చుకున్న‌ ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీకి చెందిన ప‌లువురు స్టార్స్ వెండితెర‌పై సంద‌డి చేస్తున్నారు. కృష్ణ త‌న‌యుడు మ‌హేష్ టాలీవుడ్ టాప్ స్టార్స్‌ల‌లో ఒక‌రు కాగా, ఆయ‌న త‌న‌యుడు గౌత‌మ్ ఇప్ప‌టికే సిల్వ‌ర్ స్క్రీన్‌పై సంద‌డి చేశాడు. ఇక కూతురు సితార‌ని కూడా వెండితెరపై చూడాల‌ని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సితార టాలెంట్ విష‌యానికి వ‌స్తే ఈ చిన్నారి ఇటు పాట‌ల‌తోను అటు డ్యాన్స్‌తోను అద‌రగొడుతుంది. అప్పుడ‌ప్పుడు మ‌హేష్ లేదా న‌మ్ర‌త సితారకి సంబంధించిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. వాటికి విపరీత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంది. తాజాగా సితార డ్యాన్స్ వీడియోను మహేశ్ బాబు ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. వాట్ ఏ టాలెంట్ అంటూ.. ఆయన ఈ వీడియోను షేర్ చేశారు. కన్న నిదురించరా... అనే పాటకు సితార అద్భుతంగా డ్యాన్స్ చేసి ఆశ్చర్యపరిచింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. సితార ప్రముఖ క్లాసికల్ డాన్స్ ట్రైనర్ అరుణ భిక్షు దగ్గర డాన్స్ నేర్చుకుంటోంది.


2334
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles