సీత కాదు.. శూర్ఫణక.. టీజ‌ర్

Sun,March 31, 2019 10:40 AM
Sita Teaser released

నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో మంచి హిట్ కొట్టిన తేజ ప్ర‌స్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సీత అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్‌లో విడుద‌ల కానున్న ఈ చిత్ర టీజ‌ర్ కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేశారు. నువ్వు మ‌ట్టికొట్టుకు పోతావే.. నువ్వు సీత‌వి కాదే.. శుర్ప‌ణ‌క‌వి అనే డైలాగ్ తో పాటు ఇంత కంత్రి పిల్లకి ఆ పేరు పెట్టారేమిటా అనుకున్నా.. ప‌క్క‌న శ్రీరాముడున్న సంగ‌తి అర్ధం కాలేదు వంటి సంభాష‌ణ‌లు సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి. సినిమా మొత్తం కాజ‌ల్ చుట్టూనే తిరగ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ మాటలు రాశారు. శిర్షా రే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ మూవీగా రూపొందుతుంద‌ని తెలుస్తుంది. ల‌క్ష్మీ క‌ళ్యాణం సినిమాలో కాజ‌ల్‌ని ల‌క్ష్మీగా ప‌రిచ‌యం చేసిన తేజ తాజా చిత్రంలో సీత‌గా చూపించ‌నున్నాడ‌ట‌. ఈ సినిమా కాజ‌ల్ కెరియ‌ర్‌లో మ‌రో మంచి హిట్ అవుతుందని యూనిట్ భావిస్తుంది. బెల్లకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంట‌గా వ‌చ్చిన‌ ‘కవచం’ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్ట‌గా రెండో సారి వీరిద్ధ‌రు క‌లిసి న‌టిస్తున్నారు. ఈ మూవీ మంచి హిట్ కొట్టాల‌ని వారి అభిమానులు కోరుకుంటున్నారు.

2423
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles